BigTV English

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Movie Industry : ఇటీవల కాలంలో చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు… దర్శక నిర్మాతలతో సహా అంత ఒకే జపం చేస్తున్నారు. అదే పాన్ ఇండియా సినిమా. మన సినిమాను దేశ వ్యాప్తంగా ప్రదర్శించాలి అనే ఆశ బాగుంది. కానీ అది ఎంత మూల్యానికి? పాన్ ఇండియా సినిమా తియ్యాలని అని ఆశ పడటంలో తప్పు లేదు. అది చాలా మంచి విషయం. కానీ, అవి పెద్ద సినిమాలు. ఆ సినిమా తియ్యడానికి కానీసం రెండు నుంచి మూడేళ్లు పడుతుంది. అంటే ఒక హీరో కనీసం రెండేళ్లు ఒకే సినిమా మీద పనిచేయాల్సి వస్తుంది. మన ఇండస్ట్రీలో టాప్ టైర్ లో ఉన్న హీరోలు ఇలా రెండేళ్ళకు ఒక సినిమా తీస్తా అని నిర్ణయించుకుంటే, థియేటర్, డిస్ట్రిబ్యూటర్‌ల పరిస్థితి ఏంటి? 365 రోజులు థియేటర్ ని ఎలా నడపగలుగుతారు.


రాజమౌళి SSMB29 తీస్తున్నారు, ఈ సినిమాకు మహేష్ తన నాలుగేళ్ల టైంని కేటాయిటించాడు. గతంలో మహేష్ ఏడాదికి ఒక సినిమా చొప్పున చేస్తే కానీసం 200 కోట్లు రాబట్టేవాడు. అంటే నాలుగేళ్లలో ఎంత లేదన్న 800 నుంచి 1000 కోట్లు ఆడియన్స్ నుంచి కలెక్షన్ల రూపంలో వచ్చేవి. ఇప్పుడు ఇది అంత నష్టమే కదా. దీనికి తోడు పాన్ ఇండియా సినిమా ఖర్చు స్విస్ బ్యాంక్‌లో దాచుకున్న నల్ల డబ్బుతో సమానం.

ఆ డబ్బును తిరిగి సంపాదించుకోవడానికి ప్రొడ్యూసర్లు టికెట్ రెట్లను పెంచేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలకు సినిమా థియేటర్ అనేది అందుకోలేని వజ్రంలా మారిపోయింది.


ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ఇండస్ట్రీకి నష్టమే

పాన్ ఇండియా జబ్బు ఒకెత్తు అయితే… రెండో జబ్బు, ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండగల టైంలో… ఒక్క రోజే మూడు నుంచి నాలుగు సినిమాలు వరుసగా రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల ఈ సమస్యను మనం ఆగస్ట్‌లో, ఇండిపెండెన్స్ డే టైంలో చూశాం. ఆగస్టు 15న కూలీ, వార్ 2 లాంటి రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అసలే వారంలో నాలుగు, ఐదు రోజులు థియేటర్ లో సీట్లు దుమ్ము పట్టిపోతున్నాయని ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొత్తుకుంటే, మళ్లీ ఇదో గోల. ఒక పెద్ద సినిమా వస్తున్నపుడు, ఇంకో పెద్ద సినిమా ఒక వారం వెనక్కో, ముందుకో తప్పుకుంటే నష్టం ఏంటి?

ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. దాన్ని చూడటానికి వారం రోజుల టైం ఉంటుంది కాబట్టి… ఆడియన్స్‌ ఎంతో కంత మంది చూసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా, రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేస్తే, ఒకే వారం రిలీజ్ చేస్తే ఓ సినిమా నష్టపోతుంది. ఆ సినిమా చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ రావడం లేదు. ఇండస్ట్రీపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

అసలు రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు ఎందుకు రావాలి? ఓటిటి డీల్స్ కారణమా? హీరోల ఈగోలు కారణమా? ప్రొడ్యూసర్ల బిజినెస్ కారణమా ? సమాధానం ఆ భగవంతుడే చెప్పాలి. ఇలా అయితే థియేటర్ లు కూడా జాతర పండుగల మారిపోతాయి. ఊపు ఉన్నపుడు కైలాసం, లేదా పాతాళంల మారిపోతాయి. ఈ పరిస్థితి ఇంక కొన్నాళ్లు కొనసాగితే సినిమా థియేటర్ల దుకాణం మూసుకోవాల్సి వస్తుందేమో.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×