Mother Teresa: మదర్ తెరిస్సా(Mother Teresa) ఈ పేరు తెలియని వారు ఉండరు. కష్టాల్లో ఉన్నవారికి సేవ చేస్తూ తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక గొప్ప త్యాగమూర్తి. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే వారి కష్టాలను అందరికీ చెబుతూ సంతోషించే రోజులు అలాంటిది ఎదుటివారి కష్టం కోసం తన జీవితాన్ని ధారబోసి అందరికీ నేనున్నానంటూ భరోసా కల్పించిన త్యాగమూర్తి మదర్ తెరిస్సా. 1910, ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ తెరిస్సా సెప్టెంబర్ 5, 1997 లో మరణించారు. ఇలా గొప్ప త్యాగమూర్తి మరణించినప్పటికీ ఈమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈమె జయంతి వేడుకలను ఇప్పటికి నిర్వహిస్తున్నారు.
మదర్ తెరిస్సా జయంతి వేడుక…
ఇటీవల మదర్ తెరిస్సా 115 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో భాగంగా పలువురు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే లయన్స్ క్లబ్(Lions Club), హెల్ప్ ఫౌండేషన్(Help Foundation) ఆధ్వర్యంలో 26వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామంలో గల మదర్ తెరిస్సా వికలాంగుల యువజన సంఘం ఆశ్రమంలో ఈ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెల్ప్ ఫౌండేషన్ అధ్యక్షులు ముత్యాల రామదాసు ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు దివ్యాంగులకు అలాగే నిరుపేదలకు పెద్ద ఎత్తున క్రీడ పోటీలను నిర్వహించారు.
వీల్ చైర్లు పంపిణీ..
ఇక ఈ క్రీడా పోటీలలో భాగంగా విజయం సాధించిన వారికి బహుమతులను కూడా అందజేశారు. ఇక ఆశ్రమంలో ఉన్నవారికి పండ్లు దుప్పట్లతో పాటు అవసరమైన వారికి వీల్ చైర్ పంపిణీ చేశారు. ఇక ఈ సమావేశంలో భాగంగా ముత్యాల రామదాసు (Muthyala Ramadasu)మాట్లాడుతూ దివ్యాంగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వారికి పలు విషయాలలో భరోసా కల్పించారు. అనంతరం భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామదాసు గారితో పాటు లయన్ క్లబ్ ప్రెసిడెంట్ బస్సు శ్రీదేవి గారు, లయన్స్ క్లబ్ గత ప్రెసిడెంట్ అల్లాడి కవిత, లయన్స్ క్లబ్ మెంబర్ వాణిశ్రీ, మేడిద వెంకటేశ్వరరావు, (మేడిద సుబ్బయ్య ట్రస్ట్) మరియు దివ్యాంగ సంఘం నాయకులు ఎన్ సత్యనారాయణ బి.రాజు, టి. సురేష్, జె.దుర్గమ్మ, పి శ్యామల వంటి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Teja Sajja: అందుకే పాన్ ఇండియా స్టార్ అని పిలవద్దు.. అంత ఇబ్బందిగా ఉందా!