BigTV English

Tongue : నాలుకపై మచ్చ ఉంటే..

Tongue : నాలుకపై మచ్చ ఉంటే..
tongue

tongue : పుట్టుమచ్చలు అనేవి సాధారణంగా అందరికి ఉండటం సహజమే .సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలో ఉండే సంకేతాలు, గుర్తులు నిర్దిష్టమైన అర్థాన్ని కలిగి ఉంటాయి.పుట్టు మచ్చలు, గీతలు మనుషుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం వల్ల వ్యక్తుల గురించి తెలుసుకోవడమే కాకుండా శరీరానికి ఆకర్షణీయతను పెంచుతాయి.


నాలుక చివరి భాగంలో మచ్చ ఉన్నచో వారు ఎదుటివారి మనస్సును అర్థం చేసుకునే వారైయుంటారు. మాటలతోనే అందరికి ఆకట్టుకుంటారు. ఒకవేళ ఆ మచ్చ పచ్చ రంగులో ఉంటే.. వారు విద్యావంతుడై అనేక సభలలో గౌరవ సన్మానాలు పొందుతారు.అలానే నాలుక కింది భాగంలో మచ్చ ఉన్నచో వారు యోగాభ్యాసమునందు కోరిక కలవారై ఉంటారు. అంతేకాకుండా తపస్సు చేయుటకు అడవుల బాట పడతారు నాలుక పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు గొప్ప ఉపన్యాసులవుతారు. ఏరంగులో మచ్చ ఉన్నను శుభ ఫలితాలు కలుగుతాయి.

ఎవరైనా వ్యక్తులకు పై పెదవి ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే అది మంచిదిగా పరిగణించరు. అలాంటి వారికి ప్రేమ విషయంలో విజయం పెద్దగా రాకపోవచ్చు. హృదయం మంచిగా ఉన్నప్పటికీ వీరు తమ భాగస్వామి నుంచి ప్రేమను పొందలేరు.ఇలాంటి మచ్చ మహిళలు మాత్రం సంతోషంగా ఉంటారు. స్త్రీ లేదా పురుషుడు కింద పెదవికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారి కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తి ముఖంపై పెదవికి ఎడమ వైపున మచ్చిన ఉంటే అలాంటి వారికి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం. ఎవరైనా వ్యక్తి కింద పెదవి మధ్యలో మచ్చ ఉంటే అలాంటి స్త్రీలు తమ భర్తను చాలా ప్రేమిస్తారని నమ్ముతారు. కొన్నిసార్లు వారు అజ్ఞానం వల్ల ఇద్దరూ గొడవలు పడతారు. . ఇలాంటి మచ్చలు ఉన్న పురుషులు కూడా తమ భార్యను చాలా ప్రేమిస్తారు


Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×