Chiranjeevi at Hyderabad Airport: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పందించారు. తాజాగా ఇండియాఉ వచ్చిన ఆయన ఎయిర్పోర్టులో విలేకరులు దీనిపై ప్రశ్నించారు. దీనిక చిరు ఇచ్చిన రియాక్షన్ షాకిస్తుంది. ఏపీ అసెంబ్లీలో ఇటీవల బాలక్రష్ణ మాజీ సీఎం జగన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ క్రమంలో కరోనా సమయంలో సినిమా సమస్యలపై మాట్లాడానికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవిని అవమానించారని, వైఎస్ జగన్ ఓ సైకో అని వ్యాఖ్యానించారు. అయితే బాలయ్య వ్యాఖ్యలపై వెంటనే చిరు స్పందించారు. ఆయన కామెంట్స్ని ఖండిస్తూ జగన్ తనని అవమానించలేదని స్పష్టం చేశారు.
దీనిపై వివరణ ఇస్తూ ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ మాటలను నేను టీవీలో చూశాను. ఆయన వ్యాఖ్యలు ఒకింత వ్యంగ్యం అనిపించాయని లేఖలో పేర్కొన్నారు. ఆయన ఇండియాలో లేకపోవడంతో ఈ స్టెట్మెంట్ ఇచ్చారు. తాజాగా వెకేషన్ నుంచి వచ్చిన ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆయన అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు. అయితే విలేకరులను ప్రశ్నలను ఆయన దాటవేశారు. ఇప్పటికే చెప్పాల్సింద చెప్పేశానని, ఇక మాట్లాడాల్సింది ఏం లేదని అన్నారు. ఇక హైదరాబాద్ ఎయిర్పోర్టుకి వచ్చిన ఆయన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు.
కాగా చిరు తన ప్రకటనలో ఇలా అన్నారు. “అసెంబ్లీలో బాలకృష్ణ ఒకింత వ్యంగ్యం మాట్లాడటం టీవీలో చూశా. నా పేరు ప్రస్థావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా. నన్ను లంచ్‌కి రావాలని జగన్ స్వయంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తుండగా.. సీఎం జగన్ గారితో ఇండస్ట్రీ సమస్యల గురించి ప్రస్తావించాను. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామంటే సరే అన్నారు. కోవిడ్ కారణంగా ఐదుగురు మాత్రమే రావాలన్నారు. కానీ, మేము పదిమంది వస్తామంటే ఆయన సరే అన్నారు. డేట్ ఫిక్స్ చేసి మమ్మల్ని రమ్మన్నారు.
అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. దీంతో నేను ఒక ఫ్లైయిట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తి గారితో సహా మరి కొంతమందితో వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను.టికెట్ ధరల పెంపు విషయమై మాట్లాడాం. ప్రభుత్వ నిర్ణయం వల్లే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీ టికెట్ రేట్స్ పెరిగాయి. ఆయన ఇండస్ట్రీకి అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు. నాతో పాటు అక్కడ ఉన్నవారి అందరిపట్ల ఆయన గౌరవంగా వ్యవహరించారు. ఎవరిని కూడా ఆయన అవమానించలేదు. నేను సాక్షిని” అని చిరు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహరం ఇటూ ఇండస్ట్రీ అటూ పరిశ్రమలో సంచలనంగా మారాయి.