OG Movie Tickets :సాధారణంగా సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం ప్రమోషన్స్ రూపంలో ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే. భిన్నమైన పనులను చేస్తూ ప్రజలలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది టికెట్లు రేట్లు తగ్గించడం, 1+1 ఆఫర్ పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఇలా ఉండగా.. ఇక్కడ పవన్ కళ్యాణ్ మూవీకి కూడా అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్ .పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టికెట్ కొంటే మినీ బిర్యానీ ప్యాక్ ఉచితం అంటూ చేసిన ప్రకటన ఆడియన్స్ కి కాస్త సంతోషాన్ని కలిగించినా.. పవన్ కళ్యాణ్ పై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
అసలు విషయంలోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్ (Sujeeth) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఓజీ (OG). సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున ప్రీమియర్స్ పడ్డ విషయం తెలిసిందే. అలా మొదటి రోజే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా మొదట్లో బాగానే కలెక్షన్లు రాబట్టింది కానీ ఇప్పుడు రోజు రోజుకి దారుణంగా పడిపోతున్నాయి. నిన్న ఆదివారం , పైగా దసరా
హాలిడేస్ కూడా కలిసి వచ్చినా.. కనీసం 20 కోట్లు కూడా మించి కలెక్షన్స్ వసూలు చేయలేదని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో మేకర్స్ ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు.. ఓ.జి టికెట్ ను జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ (District by Zomato) లో కొనుగోలు చేస్తే.. ప్యారడైజ్ నుండి మినీ బిర్యానీ ప్యాక్ ఫ్రీగా పొందవచ్చు అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు పోస్టర్ ను కూడా పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
పవన్ మూవీకి ఇవేం తిప్పల్రా సామి..
ఇకపోతే ఇది చూసిన ఆడియన్స్ కూడా పవన్ మూవీకి ఇవేం తిప్పల్రా సామీ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. నిజానికి పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాలో గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడు అంటేనే అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా థియేటర్ కి క్యూ కడతారు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకంగా సినిమా చేసినా .. ఆయన సినిమా చూడడానికి ఆడియన్స్ థియేటర్ కి రాకపోవడంతో ఇలాంటి ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ మూవీకి ఇలాంటి తిప్పలు ఎవరు ఊహించలేనివి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గుతోందా?
మరోవైపు పవన్ కళ్యాణ్ పై ఈమధ్య క్రేజ్ తగ్గుతోందని, అందుకే కంటెంట్ కోసమే ఆరాటపడుతున్న ఆడియన్స్ కి అటు హీరో ఎవరన్నది పట్టింపు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీకి ఈ ఆఫర్ ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ:Kayadu Lohar: కరూర్ తొక్కిసలాట ఘటనలో కయాదు ఫ్రెండ్ మృతి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.