Jan Dhan Account Re-KYC: కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన-PMJDY పథకాన్ని తీసుకొచ్చింది. అధి ప్రారంభించి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక జీవనాడిగా మారింది. బ్యాంకు ఖాతా తెరిచిన 11 ఏళ్లు సందర్భంగా రీ-KYC చేయించుకోవాలి. లేకుంటే మీ ఖాతా క్లోజ్ అయ్యే అవకాశముంది.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ మొదలుపెట్టి గతనెల ఆగష్టు నాటికి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 56 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. దీని ద్వారా 2.60 లక్షల కోట్లు చేరినట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. ఈ ఖాతాల కిందట 56 శాతం మహిళలే ఉన్నారు. అయితే 11 ఏళ్లు అయిన సందర్బంగా జన్‌ధన్ ఖాతాదారులందరూ సెప్టెంబర్ 30లోపు తిరిగి కెవైసీని పూర్తి చేయాలని ఆదేశించింది.
ఒకవేళ చేయకపోతే బ్యాంకు మీ ఖాతాలను క్లోజ్ చేయనున్నాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఒక్కసారి ఖాతాదారులు మీ అకౌంట్లను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులు ఆ ఖాతాల్లో పడుతున్నాయి. ఒకవేళ మీరు ఏ మాత్రం ఆలస్యం చేసినా ఖాతా క్లోజ్ అవ్వడం ఖాయం.
రీ-కెవైసి అనేది మీ పేరు, చిరునామా, ఫోటో వంటివి అప్ డేట్ చేసే సులభమైన ప్రక్రియ. ఇది మోసాన్ని నిరోధించడం, బ్యాంకింగ్ సేవలు సజావుగా పని చేయడానికి సహాయపడుతుంది. దీనికి ప్రభుత్వ రంగ బ్యాంకులు జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు అంటే మంగళవారంతో ఇచ్చిన గడువు పూర్తి కానుంది. అందుకోసం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీ స్థాయిలో శిబిరాలను నిర్వహించారు.
ALSO READ: దేశంలో విస్కీ అమ్మకాలు లెక్కలు, సౌత్‌దే అగ్రస్థానం
ఆ తర్వాత ఖాతాదారుల ఇళ్లను సందర్శించి తిరిగి KYC నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లక్షవరకు గ్రామ పంచాయతీలలో శిబిరాలు నిర్వహించారు. ఖాతా పని చేయకపోతే లావాదేవీలు నిలిచిపోవచ్చు. అంతేకాదు ప్రభుత్వ సబ్సిడీలు పొందడంలో సమస్యలు తలెత్తే అవకాశముంది. సామాన్యులు ఎలాంటి డబ్బు జమ చేయకుండానే బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవవచ్చు.
మీ ఖాతాతో ఉచిత రూపే కార్డును పొందుతారు. దీనివల్ల ATM ల నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. షాపుల్లో చెల్లింపులు చేయవచ్చు కూడా. జారీ చేసిన రూపే కార్డుతో ఖాతాదారుడు 2 లక్షల ప్రమాద బీమా కవర్ పొందుతాడు. ఈ ఖాతాపై 10 వేల వరకు రుణం పొందవచ్చు. గ్యాస్ సబ్సిడీ, ఇతర పథకాల నుండి వచ్చే డబ్బులు ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా మీ ఖాతాలోకి వేస్తున్నాయి.