దసరా, దీపావళి, ఛత్ పూజ సందర్భంగా రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పలు మార్గాల్లో నడిపే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా పశ్చిమ రైల్వే బాంద్రా టెర్మినస్–అయోధ్య కాంట్, బాంద్రా టెర్మినస్–లూధియానా జంక్షన్, ఉధ్నా–జయనగర్ మధ్య ప్రత్యేక ఛార్జీలతో ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ సర్వీసులు సెప్టెంబర్ చివరి నుంచి డిసెంబర్ ప్రారంభం వరకు పలు రాష్ట్రాలతో పాటు ముఖ్యమైన జంక్షన్లను కవర్ చేస్తాయి.
పశ్చిమ రైల్వే ప్రకారం.. రైలు నంబర్ 09095 బాంద్రా టెర్మినస్ – అయోధ్య కాంట్ వీక్లీ స్పెషల్ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 19, 2025 వరకు ప్రతి బుధవారం ఉదయం 11:00 గంటలకు బాంద్రా టెర్మినస్ నుండి బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు అయోధ్య కాంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు(09096) అయోధ్య కాంట్ – బాంద్రా టెర్మినస్, అక్టోబర్ 2 నుండి నవంబర్ 20 వరకు ప్రతి గురువారం రాత్రి 9:00 గంటలకు బయలుదేరి. శనివారం ఉదయం 6:00 గంటలకు ముంబై చేరుకుంటుంది. ఈ రైలు బోరివాలి, సూరత్, వడోదర, రత్లం, ఝాన్సీ, కాన్పూర్ సెంట్రల్, లక్నో మరియు బారాబంకి వంటి స్టేషన్లలో ఆగుతుంది.
అటు రైలు నంబర్ 09097 బాంద్రా టెర్మినస్ – లూధియానా జంక్షన్ వీక్లీ స్పెషల్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30, 2025 వరకు ప్రతి ఆదివారం రాత్రి 9:50 గంటలకు బాంద్రా నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం 12:30 గంటలకు లూధియానా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(09098) లూథియానా-బాంద్రా టెర్మినస్, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి మంగళవారం ఉదయం 4:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:20 గంటలకు బాంద్రా చేరుకుంటుంది. ఈ రైలు సూరత్, వడోదర, కోటా, న్యూ ఢిల్లీ, పానిపట్, అంబాలాలో ఆగుతుంది.
Read Also: ట్రైన్ లో నుంచి దూసుకొచ్చిన టెంకాయ.. ట్రాక్ పక్కన నడుస్తున్న వ్యక్తి తలకు తగిలి..
ఇక రైలు నెం. 09151 ఉద్నా-జయ్ నగర్ స్పెషల్ రైలు ఉద్నా నుంచి సెప్టెంబరు 30 ఉదయం 6:45 గంటలకు బయలుదేరి, అక్టోబర్ 1న రాత్రి 9:30 గంటలకు జైనగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు(09152) జయనగర్-ఉద్నా స్పెషల్, అక్టోబర్ 1న రాత్రి 11:00 గంటలకు జైనగర్ నుంచి బయలుదేరి అక్టోబర్ 3న సాయంత్రం 5:45 గంటలకు ఉద్నాకు చేరుకుంటుంది. ఇది సూరత్, వడోదర, ప్రయాగ్‌రాజ్, అరా, పాట్లీపుత్ర, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబనిలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో AC 2-టైర్, AC 3-టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. రైలు నంబర్ 09151 బుకింగ్‌లు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం అయ్యాయి. రైలు నంబర్ 09095, 09096, 09097, 09098 బుకింగ్‌లు సెప్టెంబర్ 29న PRS కౌంటర్లలో, IRCTC వెబ్‌సైట్‌లో ప్రారంభం అయ్యాయి.
Read Also: షాకింగ్.. రైలు నుంచి విడిపోయిన బోగీలు, గంట వ్యవధిలో ఏకంగా రెండుసార్లు!