Danish Kaneria: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానించి గెలిచిన టీమిండియా… తొమ్మిదో సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయితే ఇందులో టీమిండియా గెలిచి పాకిస్తాన్ వాడడం పై… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. టీమిండియా పై మ్యాచ్ ఓడిపోగానే గ్రిల్స్ లోపల భద్రంగా ఉంచిన టీవీ ఫోటోలు షేర్ చేసి… పాకిస్తాన్ జట్టుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కనేరియా.
వాస్తవంగా…దాయాదుల మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా… టీవీలు పగలగొట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో ఇండియా ఓడిపోతే…మన భారత అభిమానులు టీవీలు పగులగొట్టేవారు. అటు పాకిస్థాన్ ఓడినా.. వాళ్ల దేశంలో ఇదే పరిస్థితి ఉండేది. అయితే… ఆసియా కప్ 2025 ఓడిన నేపథ్యంలో… టీవీలు పగిలే ఛాన్స్ ఉందని కనేరియా హెచ్చరించాడు. అందుకే దానికి కౌంటర్ గా గ్రిల్స్ లోపల భద్రంగా ఉంచిన టీవీ ఫోటోలు షేర్ చేసి… పాకిస్థాన్ పరువు తీశాడు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఒక ఎమోషనల్. రెండు జట్లు తలపడ్డాయి అంటే చాలామంది ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత రాత్రి అయినా…. ఎంత పని ఉన్నా సరే ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తూ.. ఉంటారు. అలాంటిది ఈ రెండు జట్లలో ఒక జట్టు ఓడిపోతే… ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ల దేశ అభిమానులు… వేసే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా ?
వాళ్లకు కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే తయారైంది. భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఇటీవల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆ యుద్ధం తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మ్యాచులు జరిగాయి. ఇందులో పాకిస్తాన్ ను ఓడించి ఛాంపియన్ అయింది ఇండియా. దీంతో స్వదేశంలో పాకిస్తాన్ ప్లేయర్లపై ఎదురు దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. టీవీలు పగలగొట్టే సీన్లు కూడా కనిపిస్తాయి. ఇటు దుబాయ్ నుంచి పాకిస్తాన్ గడ్డపై ఆ జట్టు ప్లేయర్లు అడుగుపెడితే… వాళ్లపై దాడులు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు వాళ్ల కోసం చేస్తోంది పాకిస్తాన్ సర్కార్. ఇలాంటి నేపథ్యంలో పుండుమీద కారం చల్లి నట్లుగా…. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. టీవీలు పగలకుండా ఏర్పాట్లు చేసిన ఫోటో షేర్ చేశారు.
Danish Kaneria 📺👀🇵🇰#Pakistan #T20Is #INDvPAK #Sportskeeda pic.twitter.com/drl9s7stpz
— Sportskeeda (@Sportskeeda) September 28, 2025