BigTV English

Andhra Pradesh : పెళ్లి కావటం లేదా? అయితే.. ఈ గుడికి వెళ్లండి ..!

Andhra Pradesh : పెళ్లి కావటం లేదా? అయితే.. ఈ గుడికి వెళ్లండి ..!

Andhra Pradesh: శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్ని వర్ణనలున్నా.. ఎక్కడా ఆయనకు మీసాలున్నట్లు సాహిత్యంలో కనిపించదు. కానీ.. ఆ నల్లనయ్య మీసంతో కనిపించే ఆలయం మన తెలుగునేలపై ఉంది.


అంతేకాదు.. ఈ గుడిలో స్వామిని దర్శించుకొని, ప్రార్థించే ప్రేమికులకు తప్పక పెళ్లవుతుందనే బలమైన విశ్వాసమూ జనావళిలో ఉంది.

ఇంతటి విశిష్టత గల ఆ మీసాల వేణుగోపాల స్వామి ఆలయం నేటి కోనసీమ జిల్లాలోని పులిదిండి గ్రామంలో ఉంది.


పూతరేకులకు పేరుగాంచిన ఆత్రేయపురానికి సుమారు 7 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడే అఖండ గోదావరి.. వశిష్ట, గౌతమి నదులుగా విడిపోతుంది.

పచ్చని పంటపొలాలు, అలరించే ప్రకృతి మధ్య పొందికగా ఉండే పులిదిండి గ్రామంలో ఈ మీసాల వేణుగోపాలుడు కొలువై ఉంటాడు.

300 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో వేణుగోపాలుడు.. కుడిచేత శంఖాన్ని, ఎడమచేత చక్రాన్ని ధరించి దర్శనమిస్తాడు.

సాధారణంగా విష్ణువు కుడిచేతిలో చక్రం, ఎడమచేతిలో శంఖం ఉంటాయి. కానీ.. ఇక్కడ అందుకు భిన్నమైన నల్లరాతి మూర్తిగా స్వామి దర్శనమిస్తాడు.

వివాహం కావాలని కోరుకునే వారు ఈ కన్నయ్యను కోరుకుంటే తప్పక జరుగుతుందని ప్రతీతి.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×