BigTV English

OTT Movie : కట్టుకున్నోడి దగ్గర అడ్డంగా బుక్… భర్తను అడ్డు తొలగించుకోవడానికి షాకింగ్ పని… మతిపోగోట్టే స్పై థ్రిల్లర్

OTT Movie : కట్టుకున్నోడి దగ్గర అడ్డంగా బుక్… భర్తను అడ్డు తొలగించుకోవడానికి షాకింగ్ పని… మతిపోగోట్టే స్పై థ్రిల్లర్

OTT Movie : ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. దాని స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్‌తో గూఢచార జానర్‌లో ఒక ఐకానిక్ గా నిలిచింది. ఈ సిరీస్ మొత్తం 5 గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు అందుకుంది. ఇంకా సాటర్న్ అవార్డ్స్‌లో అత్యుత్తమ టెలివిజన్ సిరీస్ గా 4 సార్లు గెలిచింది. వీటితో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ కథ సిడ్నీ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె సీక్రెట్ ఏజెంట్ గా, ప్రమాదకరమైన మిషన్లలో పాల్గొంటుంది. ఇవి దుమ్ము దులిపే యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇన్ని అవార్డులు గెలుచుకున్న ఈ సిరీస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి .


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘Alias’ ఒక అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ టీవీ సిరీస్. దీనిని J.J. అబ్రమ్స్ రూపొందించారు. ఇది 2001 సెప్టెంబర్ 30 నుండి 2006 మే 22 వరకు ABC ఛానెల్‌లో ప్రసారమైంది. ఇది మొత్తం 5 సీజన్లు, 105 ఎపిసోడ్‌లతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో జెన్నిఫర్ గార్నర్ (సిడ్నీ బ్రిస్టో), మైకెల్ వార్టన్ (మైకెల్ వాన్), రాన్ రిఫ్కిన్ (ఆర్విన్ స్లోన్), విక్టర్ గార్బర్ (జాక్ బ్రిస్టో), కార్ల్ లంబ్లీ (మార్కస్ డిక్సన్), కెవిన్ వీస్మాన్ (మార్షల్ ఫ్లింక్‌మాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో ఈ సిరీస్ 7.6/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

సిడ్నీ బ్రిస్టో అనే యువతి కాలేజీ విద్యార్థినిలా కనిపిస్తుంది, కానీ రహస్యంగా SD-6 అనే గూఢచార సంస్థలో ఏజెంట్‌గా పనిచేస్తుంటుంది. ఆమెకు SD-6 అనేది CIA (అమెరికా రహస్య సంస్థ)లో భాగమని ఆమెకు మొదట్లో దాని నిర్వాహకులు చెప్తారు. కానీ ఇంతలోనే ఆమెకు ఒక షాకింగ్ సీక్రెట్ తెలుస్తుంది. SD-6 వాస్తవానికి శత్రు సంస్థ, ఇది అక్రమ కార్యకలాపాలు నడుపుతుంది. ఇది తెలుసుకున్న సిడ్నీ తరువాత తేరుకుని, నిజమైన CIAలో ఏజెంట్‌గా చేరుతుంది. అంతేకాకుండా SD-6ని, అందులోనే ఉండి నాశనం చేయాలనుకుంటుంది. దీంతో ఆమె డబుల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు సిడ్నీ జీవితం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకవైపు స్నేహితులు, కుటుంబంతో ఆమె సాధారణ జీవితం గడుపుతూ, మరోవైపు సీక్రెట్ ఏజెంట్ గా, ప్రమాదకరమైన మిషన్లలో పాల్గొంటూ ఉంటుంది. ఆమెకు ఈ రెండు జీవితాలను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఆమె స్నేహితులకు, ఆమె ప్రేమికుడు డానీకి, ఇంకా ఆమె కుటుంబానికి ఆమె గూఢచార జీవితం గురించి ఏమీ తెలియకుండా ఉంటుంది. అయితే ఆమె భర్తకు ఈమె మీద అనుమానం వస్తుంది.


అయితే కథ నడుస్తున్నప్పుడు, సిడ్నీ తండ్రి జాక్ బ్రిస్టో కూడా ఒక గూఢచారి అని తెలుస్తుంది. కానీ అతను సిడ్నీతో చాలా దూరంలో ఉంటాడు. జాక్ కూడా SD-6, CIA మధ్య డబుల్ గేమ్ ఆడుతూ ఉంటాడు. సిడ్నీ తల్లి గురించి కూడా కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపడతాయి. ఇవి కథను మరింత ఇంటెన్స్ గా మారుస్తాయి. ఈ కథలో మిలో రాంబోని అనే 15వ శతాబ్దపు జ్యోతిష్కుడు రాసిన పుస్తకం చుట్టూ చాలా మిషన్లు తిరుగుతాయి. ఈ పుస్తకంలో ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన రహస్యం ఉందని నమ్ముతారు. సిడ్నీ, ఆమె టీమ్ ఈ పుస్తకాన్ని శత్రువుల చేతిలోకి వెళ్లకుండా కాపాడటానికి ప్రయత్నిస్తారు. సిడ్నీ ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త మిషన్‌లో పాల్గొంటుంది. ఈ మిషన్లలో ఆమె విదేశాలకు వెళ్తూ, రకరకాల గెటప్‌లలో కనిపిస్తూ శత్రువులతో ఫైట్ చేస్తుంది. చివరికి సిడ్నీ ఈ మిషన్ ని విజయవంతంగా పూర్తి చేస్తుందా ? ఆమె ఫ్యామిలీ సీక్రెట్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పిల్లల తల్లులే ఈ సైకో టార్గెట్… బాలింతలని చూడకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా

Related News

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

OTT Movie : ఫన్ కోసం ఆడిన గేమ్ రియల్ లైఫ్ లోకి… ప్రతీ మాస్క్ వెనుక ఓ నిజం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ప్రియురాలి గదిలోకి స్నేహితున్ని పంపే ప్రియుడు … ముసలోడి నుంచి నిక్కరేసుకున్న వాడి దాకా…

OTT Movie : ఇదేం సినిమారా బాబూ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : వీళ్ళు అమ్మాయిలా ఆడ పిశాచులా మావా? వీళ్ళకి డబ్బులిస్తే చాలు ఎవరికైనా తడిచిపోవాల్సిందే

OTT Movie : బంకర్లో నుంచి బయటకొస్తే చావు మూడినట్టే… ఒక్కో సీన్ కు వణికిపోవాల్సిందే మావా

OTT Movie : గత్యంతరం లేక కుక్కను నట్టనడి అడవిలో వదిలేస్తే… చివరికి అది చేసే పనికి దిమాక్ కరాబ్ మావా

Big Stories

×