Kantara Chapter 1 Pre release: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)నటించిన కాంతారా చాప్టర్ 1(Kantara Chapter1) ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్(Ntr) ముఖ్యఅతిథిగా వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ఇటీవల ఓ ప్రమాదంలో భాగంగా గాయపడిన సంగతి తెలిసిందే అయితే తాను ఎప్పటిలాగా గట్టిగా ఈ కార్యక్రమంలో మాట్లాడలేనని నొప్పి తనను బాధిస్తోంది అంటూ తెలియచేశారు.
ఇలా ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పెద్దగా సౌకర్యవంతంగా కూడా కనిపించలేదని చెప్పాలి. ప్రమాదం కారణంగా ఆయన ఇంకా నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అయితే రిషబ్ ఆహ్వానం మేరకు కాంతార సినిమా వేడుకకు ఎన్టీఆర్ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కాంతార సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ కాంతర సినిమా స్టోరీ గురించి కథలుగా చెప్పేది. అయితే అప్పుడు అర్థం కాలేదు. చిన్నప్పుడు నేను ఏ కథ అయితే విన్నానో అదే కథను రిషబ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
కాంతార సినిమా స్టోరీ తెలిసిన నాకే ఎంతో ఎక్సైట్మెంట్ ఉండేది. ఇక కాంతార చాప్టర్ 1 కూడా అంతే అద్భుతంగా ఉందని, ఈ సినిమా కోసం రిషబ్ చాలా కష్టపడ్డారని తెలియజేశారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా థియేటర్ కి వెళ్లి సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. ఇకపోతే తనకు ఇంకా అభిమానులతో చాలా మాట్లాడాలని ఉంది కానీ ఎక్కువ సేపుతాను నిలబడలేకపోతున్నాను అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. ఇకపోతే ఎప్పటిలాగే అభిమానులకు ఎన్టీఆర్ తగు జాగ్రత్తలను కూడా తెలియజేశారు.
జాగ్రత్తగా వెళ్ళండి..
ఇంటిదగ్గర మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ఈయన అభిమానులకు జాగ్రత్తలు చెప్పడమే కాకుండా అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇలా ఎన్టీఆర్ అభిమానులకు జాగ్రత్తలు చెప్పడంతో అభిమానులు ఎన్టీఆర్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు ఆయన నొప్పితో బాధపడుతున్నప్పటికీ కూడా అభిమానుల క్షేమం గురించి ఆలోచించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పడంతో అభిమానుల పట్ల ఎన్టీఆర్ చూపించే ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ కాంతార సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా రావడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే కాంతార సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రీమియర్స్ ప్రసారం కానున్నాయి.
Also Read: Niharika: కుటుంబానికి దూరంగా నిహారిక.. వాళ్ళే నా ప్రపంచం అంటూ!