OTT Movie : ఈ మధ్య గేమ్ ఆధారంగా చాలా కథలతో సినిమాలు వస్తున్నాయి. ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వస్తున్న కథలలో హింస ఎక్కువగానే ఉంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సిరీస్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ గేమ్ లో రక్తపాతం అంతగా ఉండకపోయినా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని భయపెడుతుంది. ఈ కథ ఒక స్మార్ట్ గేమ్ డెవలపర్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఆమె గేమ్ రియల్ లైఫ్ కి లింక్ అవుతుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ లో నటించింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ది గేమ్: నెవర్ ప్లే అలోన్’ (The Game: You Never Play Alone) రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వం వహించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ (గేమ్ డెవలపర్), సంతోష్ ప్రతాప్, చాందినీ, శ్యామ హరిణి, బాలా హసన్, సుబాష్ సెల్వం ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో 2025 అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ మొదటి తమిళ ఒరిజినల్‌గా సిరీస్ గా గుర్తింపు పొందింది.
శ్రీ ఒక స్మార్ట్ గేమ్ డెవలపర్. ఆమె ‘నెవర్ ప్లే అలోన్ని’ అనే ఒక కొత్త వీడియో గేమ్ తయారు చేస్తుంది. ఈ గేమ్ లో ఎవరైతే భాగమవుతారో వాళ్ల సీక్రెట్స్ ని అది బయట పెడుతుంటుంది. శ్రీ ముందుగా తన స్నేహితుడి తో కలిసి ఈ గేమ్‌ను టెస్ట్ చేస్తుంది. గేమ్ మొదలైన తర్వాత వాళ్లిద్దరూ ఒక శిధిలావస్థలో ఉన్న ఒక పాత ఇంట్లో చిక్కుకుంటారు. ఈ గేమ్‌లో వాళ్లు వింత ఆకారాలాను,శబ్దాలను భయపడతారు. ఇక్కడ జరిగే సన్నివేశాలు వీళ్ళ గతంతో ఎదో ఒక రూపంలో సంబంధం కలిగి ఉంటాయి. శ్రీ కి చిన్నప్పుడు జరిగిన సన్నివేశాలు, ఇప్పుడు ఈ గేమ్‌లో నిజమవుతుంటాయి. ఆమె స్నేహితుడు కూడా తన గతంలో చేసిన ఒక పెద్ద తప్పు గుర్తొస్తుంది. అది ఈ గేమ్‌లో ఆతన్ని భయపెడుతుంది. ఈ గేమ్‌లో ఒక మిస్టీరియస్ అమ్మాయి కనిపిస్తుంది. ఆమె గేమ్‌కు సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ ను దాచి ఉంచినట్లు అనిపిస్తుంది.
ఇక శ్రీ గేమ్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. కానీ గేమ్ నిజ జీవితంతో కలిసిపోతుంది. వాళ్లు వేసే ప్రతి స్టెప్‌లో గేమ్ వాళ్ల మనసులను చదువుతూ, కొత్త భయాలను సృష్టిస్తుంది. కథ నడిచే కొద్దీ, ఈ గేమ్‌లో ఒక అతీత శక్తి ఉన్నట్లు అనుమానం వస్తుంది. ఇది గేమ్ ఆడే వాళ్ల మనసులో ఉండే భయాలను నిజం చేస్తుంది. ఈ కథలో ఊహించని ట్విస్ట్‌లు వస్తాయి. ఈ గేమ్ కేవలం కోడ్ తో నడుస్తోందా ? దాని వెనుక అతీత శక్తి ఉందా ? శ్రీ ఈ గేమ్ నుంచి బయట పడుతుందా ? ఈ గేమ్ కి బలవుతుందా ? అనే విషయాలను, ఈ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : వరుస మర్డర్స్ తో పోలీసులకు చెమటలు పట్టించే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్