Kantara Chapter 1 Event : రిషబ్ శెట్టి (Rishabh Shetty) నటించిన కాంతారా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాకి ప్రీక్వెల్ గా మరో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎన్టీఆర్ కి రిషబ్ శెట్టి వీరాభిమాని అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
గతంలో ఒక వేడుకలు సినిమా అప్డేట్ అడిగినందుకు సుమా (anchor Suma) ను ఎన్టీఆర్ చాలా సీరియస్ గా చూశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తర్వాత వైరల్ అయ్యాయి. సుమ భర్త రాజీవ్ కనకాల కు, ఎన్టీఆర్ కు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి వీళ్లిద్దరి మధ్య ఈ ఫ్రెండ్ షిప్ మొదలైంది.
ఇక ప్రస్తుతం జరుగుతున్న కాంతారావు సినిమా ఈవెంట్లో రుక్మిణి వసంత మాట్లాడారు. రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి సుమ అప్డేట్ మాత్రం అడగలేదు. కానీ సుమ అడిగిన ఒక ప్రశ్నకు ఎన్టీఆర్ సీరియస్ అయిపోయారు.
యాంకర్ సుమ రుక్మిణి వసంత (Rukmini Vasant) తో మాట్లాడుతూ రిషబ్ శెట్టి గురించి ఒక్క పదంలో చెప్పండి అంటూ అడిగింది. వెంటనే దానికి డివైన్ అని ఆన్సర్ చెప్పింది. రిషబ్ శెట్టి గురించి అడిగిన తర్వాత ఎన్టీఆర్ గురించి అడగడం మొదలుపెట్టింది. రుక్మిణి వసంత చాలాసేపు ఆన్సర్ చెప్పకుండా ఆలోచించింది. వాస్తవానికి ఒక పదంలో చెప్పలేను అని చాలాసార్లు చెప్పాను అని ఆన్సర్ కూడా చెప్పింది.
ఇలా చెబుతున్న తరుణంలోనే ఎన్టీఆర్ సుమని చూస్తూ పాపం వదిలేయవచ్చు కదా ఎందుకలా భయపెడుతున్నావ్ అంటూ రుక్మిణి ఉద్దేశిస్తూ స్టేజ్ దిగిపో అన్నట్లు సైగ చేశారు.
ఇదే విషయం సుమా కి కూడా అర్థమై పాపం వదిలేయమని చెబుతున్నారు అంటూ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ఎన్టీఆర్ గురించి వివరిస్తూ డిక్షనరీ అని ఒక పదంలో చెప్పేసింది. అంటే ఎన్టీఆర్ కి చాలా విషయాలు తెలుసు అని అభిప్రాయంతో ఆ మాట చెప్పి ఉంటుంది.
Also Read: Rakul Preet Singh: బెడ్ పైన పడుకుని మరీ ఆ పని చేస్తున్న రకుల్