IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టాస్ పడింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా జట్టులోకి జస్ప్రిత్ బుమ్రా, శివమ్ దూబే వచ్చారు. మరోవైపు హార్దిక్ పాండ్యా గాయం కారణంగా విశ్రాంతి తీసుకోగా..అతని స్థానంలో రింకూసింగ్ వచ్చాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో వాళ్లు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ జట్టు మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగనుంది.
Also Read : BCCI : బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్… ఓజా, RP సింగ్ లకు కీలక పదవులు
ఆసియా కప్ 2025 లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడటం ఇది ముచ్చటగా మూడో సారి. అంతకు ముందు గ్రూపు దశలో, సూపర్ 4లో రెండు జట్లు తలపడ్డాయి. అయితే రెండింటిలో కూడా టీమిండియానే విజయం సాధించింది. తాజాగా జరుగుతున్న ఫైనల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది. టీమిండియా అభిమానులు సైతం అదే సీన్ రిపీట్ కాబోతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ కోసం ఇండియాలో 100 కు పైగా పీవీఆర్ ఐనాక్స్ స్క్రీన్ల పై ప్రత్యక్ష్యంగా ప్రసారం చేయనున్నారు. అలాగే డీడీ స్పోర్ట్స్ లో కూడా ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరోవైపు ఇవాళ కూడా టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం.
ముఖ్యంగా గ్రూపు దశ, సూపర్ 4 దశలో తలపడినప్పుడు బాయ్ అన్నారు.. కానీ ఫైనల్ మ్యాచ్ కోసం చాలా మందికి టికెట్లు దొరకకపోవడం విశేషం. ఇక ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ.. కొందరూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. బాయ్ కాట్ గ్యాంగ్ కాస్త టికెట్ బుకింగ్ గ్యాంగ్ గా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా అతని స్థానంలో టీమిండియా కీలక బ్యాటర్ రింకూసింగ్ బ్యాటింగ్ చేసేందుకు ఫైనల్ లో అవకాశం లభించింది. చివర్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రారంభిస్తే అదృష్టం కలిసి వస్తుందని ప్రతీ మ్యాచ్ లో తొలి ఓవర్ అతనితోనే వేయించాడు సూర్యకుమార్ యాదవ్. కానీ ఈ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో తొలి ఓవర్ ఎవ్వరూ వేస్తారనే ప్రచారం జరుగుతోంది.
భారత జట్టు :
సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్తాన్ జట్టు :
సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (wk), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.