BigTV English

Lucky Photos : ఈఫోటోను తాకిన ఇంటి నుంచి బయటకి వెళ్తే ఏం జరుగుతుంది..?

Lucky Photos : ఈఫోటోను తాకిన ఇంటి నుంచి బయటకి వెళ్తే ఏం జరుగుతుంది..?


Lucky Photos : ఇంటి నుంచి బయటకి వెళ్లేటప్పుడు కొంతమంది సెంటిమెంట్ గా ఫీలవుతుంటారు. నచ్చిన వారిని ఎదురు రమ్మని అడుగుతారు. మరికొందరు ఇష్టదైవాన్ని తలుచుకుంటే ముందుకు కదులుతారు. మరికొందరు అవేమీ పట్టనట్టుగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం అందరికి మంచి జరిగేలా కొన్ని సూచనలు చేసింది. ఇంటికి నుంచి బయటకి వెళ్లేటప్పుడు బయటి గుమ్మంపైన వేళాడదీసిన పంచముఖ ఆంజనేయ స్వామిని తాకి వెళ్తే తిరుగుండదని చెబుతోంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి చేరతారంటోంది. అలా తాకి వెళ్లడం వల్ల ఎలాంటి దోషాలు కలగవు. సింహద్వారం పైనే ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రతీ ఇంటి దగ్గర ఉండాల్సిన మరో పటం కీర్తిముఖుడుది. ఇంటి బయట నుంచి లోపలకి వస్తున్నప్పుడు మీకు కుడివైపు ఉండేలా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అన్ని రకాల దిష్టి దోషాలను తొలగించేందుకు కీర్తి ముఖుడు చిత్రం సహాయపడుతుంది. మొసలి ఆకారంలో ముఖాన్నికలిగిన కీర్తి ముఖుడు అంటే దేవుడు ఫోటో కాదు. గజేంద్ర మోక్షంలో మకరధ్వజుడి ప్రస్తావన ఉంటుంది. మకరధ్వజుడ్ని శ్రీ మహా విష్ణువు సంహరించిన తర్వాత ఆయన ఒక వరం అనుగ్రహించాడు. దాని ప్రకారం ఎవరైతే ఇంటి ముందు కీర్తిముఖుడి ఫోటో పెట్టుకుంటారో వారికి ఎలాంటి దోషాలు ఉండవని శ్రీవిష్ణువు మకరధ్వజుడికి వరమిచ్చాడట . మకరధ్వజుడి రూపం మొసలి రూపంలో ఉండేదానినే ఇప్పుడు దిష్టిబొమ్మ రూపంలో అందరూ పెట్టుకుంటున్నారు.


ఇంటి ముందు కనిపించే దిష్టిబొమ్మ ఫోటోనే కీర్తిముఖుడు. ఈ ఆచారం రావడానికి కారణం శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరమే. వెంకటేశ్వరసామి ఆలయాలకు వెళ్లినప్పుడు గమనిస్తే శ్రీవారికి మకరతోరణం కనిపిస్తుంది. ఆ తోరణం మధ్యలోనే మొసలి ఆకారంలో ఒక ముఖం కనిపిస్తుంది. ఆ ముఖాన్ని దర్శిస్తే మనకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే దిష్టి పోవడానికి ఇంటి ముందు పెద్ద పెద్ద కళ్లుతో ఉన్న దిష్టి గణపతిని ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదే. మాములుగా గణపతివి చిన్న కళ్లు. కానీ దిష్టి గణపతికి పెద్ద కళ్లు, విశాలంగా కనిపిస్తాయి. ఇంటి ముందు దిష్టి గణపతి , పంచముఖ ఆంజనేయుడి పటాన్ని ఏర్పాటు చేసుకోవడం శ్రేయోదాయకం.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×