Tollywood: ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి
. పెద్దగా తారాగణం లేకపోయినా చిన్న చిన్న నటీనటులే మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. అలాంటి చిత్రాలలో ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ సినిమా కూడా ఒకటి. నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ , రాధికా శరత్ కుమార్, సుమన్, ఆమని, రాజా చెంబోలు, ప్రిన్స్ రామ వర్మ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి విపిన్ దర్శకత్వం వహించారు. ఉమాదేవి కోట నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
యూత్ కి నచ్చేలా ప్రేమ.. సంగీత ప్రియులను కట్టిపడేసే మ్యూజిక్.. అద్భుతమైన లొకేషన్స్ తో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో అలరించి ఓటీటీలోకి వచ్చేసింది. చూస్తున్నంత సేపు అద్భుతమైన అనుభూతిని అందించే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నిలిచిపోయింది. ఇక ఈరోజు నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మధురమైన ప్రేమ కథను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్ది డైరెక్టర్ విపిన్ సక్సెస్ అందుకున్నారు.
ALSO READ:Emraan hashmi: ప్రేమకథతో రాబోతున్న మీ ఓమీ.. రిలీజ్ ఎప్పుడంటే?
మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమా స్టోరీ..
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే వరుణ్ (నరేష్ అగస్త్య) ఒక ధనవంతుడి కొడుకు. కానీ సొంతంగా ఏదో సాధించాలని , తన కళలను నిరూపించుకోవాలని నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన తండ్రి ఇష్టాలకు, ఆశయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాడు.. ఇలా సాగుతున్న క్రమంలో వరుణ్ కి మేఘన (రాబియా ఖాతూన్)తో పరిచయం ఏర్పడుతుంది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక ప్రేమగా మారిన బంధంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? కథ ఎలాంటి మరుపు తీసుకుంది? అనేది చాలా చక్కగా తెరకెక్కించారు.
విశ్లేషణ..
అందమైన లొకేషన్స్ లో కన్నుల పండుగగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కుటుంబంతో పాటు హాయిగా చూడదగ్గ సినిమా ఇది. భావోద్వేగాలు మనసును హత్తుకుంటాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.. నటన ప్రతిభతో ప్రతి ఒక్కరు కట్టిపడేశారు. స్క్రీన్ ప్రజెంట్ చాలా చక్కగా ఉంది. ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో తులసి, ఆమని, రాధికా శరత్ కుమార్, సుమన్ పాత్రలు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. పాటలు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు మరింత బాగున్నాయి. ఎంతో శ్రద్ధతో నిర్మాత ఉమాదేవి కోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్ గా ఉండాలి అంటే శ్రద్ధ తీసుకోవాలి. అంతకు పదిరెట్లు వీళ్ళు మనసుపెట్టి నిర్మించారు అని సినిమా చూస్తే తెలుస్తుంది. మరి థియేటర్లలో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రేటింగ్ అందుకుంటుందో చూడాలి.