Emraan hashmi:ఓమీ.. ఈ పేరు ఇప్పుడు ట్రెండింగ్.. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG ) సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంత హైలెట్ అయ్యారు ఓమీ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan hashmi).. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఇమ్రాన్ హష్మీకి వరుస అవకాశాలు వస్తాయని అంటున్నారు సినిమా చూసిన సినీ విశ్లేషకులు. అంతేకాదు ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ నటనను చూసి బాలీవుడ్ ఈయనని ఎందుకు కరెక్ట్ గా వాడుకోలేకపోయింది అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అంతలా ఇమ్రాన్ నటనకు సౌత్ ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు.అయితే అలాంటి ఇమ్రాన్ హష్మీ త్వరలోనే ఓ ప్రేమ కథతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ ప్రేమ కథ ఏంటి..? ఎప్పుడు విడుదల కాబోతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తాజాగా వచ్చిన ఓజీ సినిమాతో సౌత్ ప్రేక్షకులను అలరించారు.అలాంటి ఈయన త్వరలోనే మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారట. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. 2007లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఆవారాపన్ సినిమాకి సీక్వెల్ గా ఆవారాపన్-2 సినిమాలో నటిస్తున్నారట. 2007లో మోహిత్ సూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఆవారాపన్ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, శ్రియా శరన్, మృణాళిని శర్మ,అశుతోష్ రాణాలు ప్రధాన పాత్రలో నటించారు. 2007లో హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ గా 2025లో ఆవారాపన్ -2 తెరకెక్కబోతుంది.. ఇక ఆవారాపన్-2 సినిమాలో హీరోగా ఇమ్రాన్ హష్మీ నటించినప్పటికీ హీరోయిన్ మాత్రం చేంజ్ అయింది.
హీరోయిన్ మాత్రమే కాదు డైరెక్టర్ కూడా..
ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల నటి దిశా పటానీ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ ని కూడా చేంజ్ చేశారు.ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించగా విశేష్ బట్ నిర్మించబోతున్నారు. ఆవారాపన్-2 సినిమాలో కూడా ఇమ్రాన్ హష్మీ శివం పాత్రలోనే కనిపించబోతున్నారు.. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్ర మ్యూజిక్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది.అందుకే సినిమాకి మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని ఎంచుకోవాలని చూస్తున్నారట. అలాగే ఆవారాపన్-2 షూటింగ్ ని దాదాపు 50% వరకు బ్యాంకాక్ లోనే చేయాలని చూస్తున్నారట. దానికోసం పెద్ద షెడ్యూల్ ని బ్యాంకాక్ లో చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది రిలీజ్..
ఇక ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు వచ్చే ఏడాది జనవరిలో కల్లా పూర్తి చేయాలని చూస్తున్నట్టు బాలీవుడ్ సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. అలా జనవరి లోపు సినిమా షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ 3న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారట. మరి చూడాలి తాజాగా విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హష్మీ జాతకం ఈ సీక్వెల్ తో ఎలా మారబోతుంది అనేది.
ALSO READ:Devara 2: దేవర 2 వున్నట్టే.. మరి సెట్ పైకి వెళ్ళేదెప్పుడు ?