Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ ఇంట్లోకి చొరబడి అక్కడున్న ఐదేళ్ల చిన్నారి తల నరికేశాడు. అనంతరం గ్రామస్థులు అతనిపై దాడి చేయగా.. నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
సంఘటన వివరాలు
సాక్షుల చెబుతున్న వివరాల ప్రకారం, నిందితుడు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఏం మాట్లాడకుండా.. అక్కడే ఉన్న పదునైన ఆయిధంతో చిన్నారిపై దాడికి పాల్పడ్డాడు. చిన్నారిని రక్షించేందుకు ఆమె తల్లి ముందుకు రావడంతో ఆమెకూ తీవ్ర గాయాలు కలిగించాడని స్థానికులు తెలిపారు. తల్లి ఆవేదనతో కేకలు వేయడంతో గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నిందితుడిపై గ్రామస్థుల ఆగ్రహం
గ్రామస్థులు ఈ దారుణాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురై.. నిందితుడిని పట్టుకుని దాడి చేశారు. స్థానికులు అతడిని కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు జరిపారు.
పోలీసుల దర్యాప్తు
పోలీసులు మృతుడిని గుర్తించి, అతడు అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన మహేశ్ (25) అని తేల్చారు. ప్రాథమిక దర్యాప్తులో మహేశ్ మానసిక స్థితి సరిగా లేనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడు ఎందుకు ఇలా క్రూరమైన చర్యకు పాల్పడ్డాడనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామంలో భయాందోళనలు
చిన్నారి అమానుషంగా ప్రాణాలు కోల్పోవడంతో.. గ్రామస్థులంతా షాక్‌కి గురయ్యారు. చిన్నారి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు ఆమె పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు.
Also Read: హైదరాబాద్ వరద బాధితులకు అండగా ఉండండి.. అభిమానులకు పవన్ సూచనలు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడి మానసిక స్థితి, హత్య వెనుక ఉన్న కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు.