Big Stories

Srisailam : శ్రీశైలం వెళ్లే వచ్చే వాహనాలపై బొమ్మలు వేయడానికి కారణాలేంటి….

- Advertisement -

Srisailam : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి వాహనాల్లో వెళ్లే వచ్చే వారు ఒక ప్రత్యేకమైన అనుభూతితో వస్తుంటారు. వాహనాలపై నెమలి బొమ్మ, శివలింగం బొమ్మ వేస్తుంటారు. అలా వాహనాలపై బొమ్మ వేయడానికి ఒక కారణం ఉంది. సాధారంగా ప్రయాణం చేసి వచ్చేటప్పుడు ఒక్కోసారి రకరకాల దోషాలు కూడా తగలుతుంటాయి. శ్రీశైలం మల్లిఖార్జున స్వామికి దర్శించుకుని వచ్చిన తర్వాత మన జీవితంగా మారుతుందని చెప్పడానికి వాహనంపై నెమలి బొమ్మ వేస్తారు. దేవాదిదేవతల్లో కేవలం కృష్ణుడి శిరస్సుపై మాత్రమే నెమలి బొమ్మ కనిపిస్తుంది. జీవితం చక్కని రంగుల మయం కాబోతోందని చెప్పడానికి నెమలి బొమ్మ సంకేతం. వాహనంలో అక్కడికి వెళ్లి వచ్చవారికి ఇది కలుగుతుందని చెప్పడానికి ఈ బొమ్మ వేస్తుంటారు.

- Advertisement -

వాహనాలపై ఇలా దేవుడి బొమ్మలు వేయించుకోవడం దైవికంగా మంచిదే. వాహనాలు నడిపేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. వాటి నుంచి కాపాడమని కోరుకుంటూ ఇలాంటి చేస్తుంటారు. ఈ బొమ్మలు వేసే వారికి ఒక రకంగా ఇది పోషణ అని చెప్పాలి. అలాంటి వారికి డబ్బులు ఇవ్వడం ద్వారా అన్నదానం చేసినట్టుగా భావించవచ్చు. భక్తుల ఇచ్చే డబ్బు ద్వారా వారి కుటుంబ పోషణ సాగడం కూడా పుణ్యం కిందే లెక్క. కష్టపడుతున్న వారినికి ఎంకరేజ్ చేసినట్టవుతుంది.

ఎదురుగా వచ్చే వాహనాలు ఈ వాహనంపై శివుడి బొమ్మను చూసి శ్రీశైలం వెళ్లారని తెలుసుకుంటారు. మనస్సులోనే దేవుడిని స్మరించుకుంటారు. ఎదుటి వాడిలో భక్తిభావాన్ని గుర్తు చేయడమే కాకుండా వారికి పాపాలు పొగొట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. సరదా కోసమో… అందం కోసమో… వాహనాలపై నెమలి, శివుడి బొమ్మలు వేయించుకున్నా… భక్తి కోసమో వేయించుకున్నా నలుగురికి శ్రీశైలం వెళ్లిన సంగతి తెలియచేసినట్టు అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News