ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో చెప్పడం కష్టం. ఇప్పుడు ప్రాణాలతో ఉన్న వారు మరుక్షణం ఉంటారో? ఉండరో తెలియని పరిస్థితి. అచ్చంగా ఓ జంట విషయంలో ఇలాగే జరిగింది. కారు ప్రయాణిస్తుండగా, కాసేపు పక్కన రొమాన్స్ చేయాలనుకున్నారు. కొండ అంచున ఆ పని కానిస్తుండగా, కారు నెమ్మదిగా కదిలి ముందుకెళ్లి లోయలో పడింది. కారు ఏకంగా వందల అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికాలు వెల్లడించారు. స్పాట్ లో వారిద్దరి ఒంటి మీద దుస్తులు లేవని చెప్పారు.
బ్రెజిల్ లోని వెండా నోవా డో ఇమిగ్రెంట్ లో ఈ ఘటన జరిగింది. అడ్రియానా మచాడో రిబోరో(42), ఆమె బాయ్ ఫ్రెండ్ మార్కోన్ డా సిల్వా కార్డోసో(26) కారులో లాంగ్ డ్రైవింగ్ కు వెళ్లారు. పనిలో పనిగా ఓ పార్టీకి హాజరయ్యారు. తిరిగి వచ్చే సమయంలో అర్థరాత్రి అయ్యింది. సుమారు 1300 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీదుగా కారు వచ్చింది. అక్కడికి రాగానే ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. ఒక్కసారిగా పార్టీ మూడ్ నుంచి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చారు. అక్కడే కొండ అంచులో కారును ఆపారు. హ్యాంగ్ గ్లైడింగ్ లాంచ్ రాంప్‌కు ఆనుకుని ఉన్న సుందరమైన దృశ్యానికి చూస్తూ, ఆ పని మొదలు పెట్టారు.
Read Also: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?
అదే రోజు వర్షం రావడంతో నేల తడి తడిగా ఉంది. ఇద్దరూ రొమాన్స్ చేస్తుండగా, కారు కదిలి హ్యాంగ్ గ్లైడింగ్ రాంప్ నుండి జారి లోయలోకి పడింది. సుమారు 328 అడుగుల దిగువకు పడింది. కారు పడిపోయే క్రమంలో ఇద్దరూ బయటకు విసిరివేయబడ్డారు. ఆ విషయాన్ని గమనించిన ఇతర వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి గాలింపు తర్వాత మార్కోన్ డెడ్ బాడీ గుర్తించారు. అతడి మృతదేహం నగ్నంగా కనిపించింది. మరికొన్ని గంటల తర్వాత అడ్రియానా మృతదేహాన్ని కనిపెట్టారు. “సంఘటనా స్థలంలో, మృతదేహాలపై ఎటువంటి దాడికి సంబంధించిన సంకేతాలు లేవు. హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేయబడి ఉంది” అని మిలిటరీ పోలీసు అధికారి ఆల్బెర్టో రోక్ పెరెస్ ది సన్ వెల్లడించారు. “తెల్లవారుజామున 1:30 నుంచి 2 గంటల మధ్య పెద్ద శబ్దం విన్నట్లు స్థానికులు వెల్లడించారు. ఆ సమయంలో చీకటిగా ఉండటం, భారీ వృక్షాలు దట్టంగా ఉండటం వల్ల, ఆ సమయంలో ఎవరూ ఏమీ చూడలేదు” అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చే వరకు ఏం జరిగిందో చెప్పలేమన్నారు.
Read Also: