Bastar Dussehra Festival: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం.. ప్రత్యేకమైన సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జరిపే దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందాయి. ఇతర ప్రాంతాలలో దసరా పది రోజులపాటు మాత్రమే జరుపుకుంటారు. అయితే బస్తర్‌లో మాత్రం దసరా వేడుకలు 75 రోజుల పాటు కొనసాగుతాయి. దీని వెనుక ఉన్న చరిత్ర, ఆధ్యాత్మికత, ఆచారాలు ఈ ప్రాంత ప్రజల ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు.
జోగీ బిఠాయీ – ఒక అద్భుతమైన ఆచారం
బస్తర్ దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైన సంప్రదాయాల్లో ఒకటి జోగీ బిఠాయీ. ఈ వేడుకల్లో ఓ యువకుడికి అలంకరించి నాలుగు అడుగుల గొయ్య లో కూర్చోబెడతారు. ఆ యువకుడు తొమ్మిది రోజులపాటు ఆహారం. నీరు లేకుండా అక్కడే ఉండి పూజల్లో పాల్గొంటారు. వేడుకల్లో ఓ యువకుడికి అలంకరించి నాలుగు అడుగుల గొయ్య లో కూర్చోబెడతారు. ఆ యువకుడు తొమ్మిది రోజులపాటు ఆహారం. నీరు లేకుండా అక్కడే ఉండి పూజల్లో పాల్గొంటారు. దంతేశ్వరి టెంపుల్ కాంప్లెక్స్ సర్హాసర్ భవన్ లో600 ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.
దంతేశ్వరి దేవాలయం ప్రాధాన్యం
బస్తర్ దసరా ఉత్సవాలు ప్రధానంగా దంతేశ్వరి దేవికి అంకితం చేయబడ్డాయి. జాగ్దల్‌పూర్‌లోని దంతేశ్వరి టెంపుల్ ఈ ఉత్సవాలకు ప్రత్యేకమైన ప్రదేశం. దేవి దంతేశ్వరి ఈ ప్రాంతానికి శక్తి స్వరూపిణిగా భావించబడుతుంది. ప్రతి ఏడాది దసరా ప్రారంభం నుంచి 75 రోజులపాటు ఇక్కడ వివిధ ఆచారాలు, పూజలు జరుగుతాయి. జోగీ బిఠాయీ కార్యక్రమం కూడా ఈ ఆలయ సముదాయంలోని సర్హాసర్ భవన్ ప్రాంగణంలో జరుగుతుంది.
600 ఏళ్ల చరిత్ర
ఈ సాంప్రదాయం సుమారు 600 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతోంది. పూర్వకాలంలో స్థానిక రాజులు, సామంతులు ఈ వేడుకలను ప్రారంభించారని చెబుతారు. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఈ ఆచారం ఒక తరం నుంచి మరొక తరానికి అందుతూ వస్తోంది. కాలక్రమేణా పూజా విధానాలు మారినా, జోగీ బిఠాయీ వంటి ప్రధాన ఆచారాలు మాత్రం యధాతథంగా కొనసాగుతున్నాయి.
ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాధాన్యం
బస్తర్ దసరా ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కాకుండా, పర్యాటక ఆకర్షణగా కూడా నిలుస్తున్నాయి. ఈ కాలంలో దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు బస్తర్‌కి వస్తారు. స్థానిక గిరిజన సంప్రదాయాలు, జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు కూడా ఉత్సవాల్లో భాగమవుతాయి. దీంతో ఈ ప్రాంతం ఒక పెద్ద సాంస్కృతిక హబ్‌గా మారిపోతుంది.
Also Read: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల..
విశ్వాసానికి ప్రతీక
జోగీ బిఠాయీ ఆచారం కొంచెం కఠినమైనదప్పటికీ, స్థానికులు దీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆహారం, నీరు లేకుండా గొయ్యిలో కూర్చున్న యువకుడు దేవి ఆశీస్సులను పొందుతాడని, ఆ సంవత్సరం సమాజానికి భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు.