E-Paper
Advertisement

Road Accident: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఘోర రోడ్డు ప్రమాదం.. 29 మంది మృతి.. ఎక్కడంటే..?

Road Accident: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఘోర రోడ్డు ప్రమాదం.. 29 మంది మృతి.. ఎక్కడంటే..?
Advertisement

Road Accident in Pakisthan: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 29 మంది దుర్మరణం చెందారు . పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రావిన్సుల్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాలులో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 29 మంది మృతిచెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించి స్థానిక మీడియా ఆ వివరాలను వెల్లడించింది. బస్సు హవేలీ కహుటా నుంచి రావల్పిండికి 30 మంది ప్రయాణికులతో వెళ్తున్నదని, పానా బ్రిడ్జికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది. పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని అందులో వెల్లడించింది. అయితే, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయం రక్షించేందుకు ముస్లింల పోరాటం.. పూజారి ఏమన్నారంటే

Advertisement

ఇదిలా ఉంటే.. గత మంగళవారం 51 మంది పాకిస్థానీలతో కూడిన బస్సు ఇరాన్ వెళ్తున్న క్రమంలో రాత్రి సమయంలో యాజ్డ్ ప్రావిన్సులోని చెక్ పాయింట్ వద్ద ఆ బస్సు బోల్తా పడింది. దీంతో ఆ బస్సులో మంటలు అంటుకున్నాయి. బ్రేక్ ఫెయిల్యూర్ రోడ్డు ప్రమాదానికి కారణమంటూ ఇరాన్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఆ ప్రమాదంలో మృతిచెందిన 28 మంది యాత్రికుల మృతదేహాలను పాకిస్థాన్ కు పంపారు.

Tags

Related News

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

Big Stories

Advertisement
×