E-Paper
Advertisement

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు
Advertisement

Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య దాడులు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు అధినేత మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా, మరోవైపు బాంబు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల‌ను దాడిని తిప్పికొట్టే క్రమంలో అమెరికా సైనికులు ఇద్దరు మృతి చెందారు.

ఇరాన్ భీకర దాడులు-జోర్డాన్‌ సరిహద్దుల్లో ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి-డ్రోన్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్-సెంట్‌కామ్ అధికారికంగా ధ్రువీకరించింది. నలుగురు అమెరికా సైనికులను వైద్య చికిత్స నిమిత్తం జోర్డాన్ ఆసుపత్రులకు తరలించారు. వారు డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. స్వల్ప గాయాలైన ఇతరులు తిరిగి విధుల్లో చేరారని తెలియజేసింది.

Advertisement

ఇద్దరు అమెరికా సైనికులు మృతి-జులై 17న దాడిలో అమెరికా సైనికుడు గల్లంతు అయ్యాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పెంటగాన్ వెల్లడించింది. ఇరాన్ యుద్ధంలో ఇప్పటివరకు చనిపోయిన అమెరికా సైనికుల సంఖ్య 16 కు చేరింది. మరో 430 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ పోర్టు సిటీపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడిలో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా తెలియాల్సివుంది.

ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు-హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే తమ లక్ష్యమని అమెరికా సైన్యం పేర్కొంది. జోర్డాన్ దాడికి బాధ్యులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్- IRGC బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు వెల్లడించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నోరు విప్పారు.

Advertisement

అమెరికా సైనికుల మరణం తమ సంకల్పాన్ని మరింత బల పరిచిందన్నారు. ఇదిలావుండగా ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మరచిపోలేని గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఒప్పందాలను పదే పదే ఉల్లంఘిస్తోందని రాసుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీలకు విశ్వసనీయత లేదన్నారు.

ALSO READ: హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

ట్రంప్ సంతకం పూర్తిగా పనికి రాదని చెప్పే ప్రయత్నం చేశారు. సైనిక చర్య కొనసాగితే ఇరాన్ ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ఇరాన్-అమెరికా మధ్య సంతకం చేసిన అవగాహన ఒప్పందానికి సంబంధించి  మహా సైతాన్ పదే పదే ఉల్లంఘించడం మరోసారి బట్టబయలు చేసిందన్నారు. బలవంతం, నిరంకుశత్వం, క్రూరత్వం అనేవి అమెరికా సిద్ధాంతం, భావజాలంలో విడదీయరాని భాగాలు ఖమేనీ రాసుకొచ్చారు.

 

 

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×