E-Paper
Advertisement

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు
Advertisement

Algeria fire: అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లో గుండెల్ని పిండేసే అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కన్నవారి ఆదరణకు దూరమై, ఆశ్రయం కోసం చేరిన అభాగ్యుల పాలిట ఆ నిలయమే కాటిలా మారింది. ఒక ఫోస్టర్ కేర్ హోమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటలు క్షణాల వ్యవధిలోనే భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఈ భీకర ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే సజీవదహనమవ్వడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

నిద్రట్లోనే కబళించిన మంటలు..
తల్లిదండ్రుల సంరక్షణ లేని అనాథ పిల్లలకు, నిరుపేదలకు ఆశ్రయం కల్పించే ఈ హోమ్‌లో ప్రమాదం జరిగిన సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నవారు ప్రాణాలు కాపాడుకోవడానికి దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Advertisement

రంగంలోకి ఫైర్ సిబ్బంది.. 3 గంటలపాటు భీకర పోరాటం
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాదాపు 10 ఫైరింజన్లను రంగంలోకి దించాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి సుమారు 3 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని అత్యంత వేగంగా ఆసుపత్రులకు తరలించేందుకు వీలుగా అధికారులు తక్షణమే 16 అంబులెన్సులను అందుబాటులోకి ఉంచి, సహాయక చర్యలను వేగవంతం చేశారు.

ప్రమాదానికి కారణం అదేనా?
ప్రస్తుతం అల్జీరియాలో నమోదవుతున్న రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలే ఈ తరహా ఘోర ప్రమాదాలకు ప్రధాన కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు. తీవ్రమైన ఎండలు, వాతావరణంలో వేడి పెరిగిపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటికే వేలాది అగ్నిప్రమాదాలు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేర్ హోమ్‌లో ప్రమాదం వెనుక షార్ట్ సర్క్యూట్ ఉందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో అల్జీరియా వ్యాప్తంగా నివాసాలు, సేవా సంస్థల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది.

Advertisement

Also Read: తెలుగు రాష్ట్రాల్లో చల్లని కబురు.. భానుడి భగభగలకు బ్రేక్.. ఆ జిల్లాల్లో దంచికొట్టిన వానలు!

Related News

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

Big Stories

Advertisement
×