BigTV English

Myanmar | భారత్‌ భూభాగంపై 600 మయన్మార్‌ సైనికులు.. చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన మిజోరం!

Myanmar | భారత పొరుగుదేశం మయన్మార్‌లో సాయుధ విద్రోహ దళాల బలం రోజురోజుకీ పెరిగిపోతోంది. మయన్మార్‌లో జుంటా సైనిక పాలన నడుస్తోంది. అక్కడ అధికారిక జుంటా సైన్యానికి, విద్రోహ అరాకన్ ఆర్మీకి మధ్య సాయుధ పోరాటం నడుస్తోంది. అయితే ఈ రెబెల్ ఆర్మీ దెబ్బకు మయన్నార్ సైనికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భారత సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నారు.

Myanmar | భారత్‌ భూభాగంపై 600 మయన్మార్‌ సైనికులు.. చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన మిజోరం!

Myanmar | భారత పొరుగుదేశం మయన్మార్‌లో సాయుధ విద్రోహ దళాల బలం రోజురోజుకీ పెరిగిపోతోంది. మయన్మార్‌లో జుంటా సైనిక పాలన నడుస్తోంది. అక్కడ అధికారిక జుంటా సైన్యానికి, విద్రోహ అరాకన్ ఆర్మీకి మధ్య సాయుధ పోరాటం నడుస్తోంది. అయితే ఈ రెబెల్ ఆర్మీ దెబ్బకు మయన్నార్ సైనికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భారత సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా భారత భూభాగంలో ఉన్న మిజోరం రాష్ట్రంలో దాదాపు 600 మంది మయన్నార్ సైనికులు శరణార్థులుగా మారారు.


ఈ పోరాటంలో అరాకన్ రెబెల్ ఆర్మీ గత కొంత కాలంగా జుంటా సైనికులు స్థావారాలను ఆక్రమించుకుంటోంది. ఈ దెబ్బతో మయన్నార్ సైనికులు అక్కడి నుంచి పారిపోయి మిజోరం రాష్ట్రంలోని లాంగట్‌లాయి జిల్లాలో తలుదాచుకున్నారు. శరణార్థులుగా వస్తున్న మయన్మార్ సైనికుల సంఖ్య ఎక్కువ కావడంతో మిజోరం ముఖ్యమంత్రి లాల్ దుహోమా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సైనికులను త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో కూడా ఈ అంశంపై చర్చించారు. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సరిహద్దుల పొడువునా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మిజోరం సిఎం ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేందుకు ఈ సైనికులని తిరిగి పంపించేయాలని చెప్పారు. సైనికులే కాదు చాలామంది మయన్నార్ పౌరులు భారత సరిహద్దులు దాటి దేశ భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి చాలా కాలంగా ఉందని.. ముందుకూడా మయన్మార్ సైనికులు ప్రాణాలు కాపాడుకునేందుకు మిజోరం వచ్చేవారని వారందరినీ విమానంలో తిరిగి పంపించేవారమని అన్నారు.


ఇటీవల ఈ అరాకన్ ఆర్మీ భారత సరిహద్దులకు సమీపంలో ఉన్న ఓ కీలక పట్టణాన్ని ఆక్రమించుకుంది. ఈ రెబెల్ ఆర్మీ బలంగా మారడానికి ముఖ్య కారణం చైనా. ఈ అరాకన్ ఆర్మీకి ఆయుధాలు చైనా అండదండలతోనే సమకూరుతున్నాయి. 2021లో మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడి సైన్యం అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి అక్కడ సాయుధ పోరాటం జరుగుతోంది.

Myanmar, Myanmar soldiers, Arakan Army, Indian territory, Mizoram,

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×