BigTV English

Snoring Murder | గురకలు పెడుతున్నాడని గొడవ.. వ్యక్తి దారుణ హత్య!

Snoring Murder | పొరుగింటి వ్యక్తి గురకల వల్ల తనకు ఇబ్బంది కలుగుతోందని ఓ వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవ రోజూ జరిగేది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో.. ఆ వ్యక్తి స్వయంగా వెళ్లి రెండు ఇళ్ల మధ్య పూర్తి స్థాయిలో గోడ కట్టాలని వాదించాడు. దీంతో మళ్లీ గొడవ మొదలైంది. ఈసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వ్యక్తి హత్య చేయబడ్డాడు.

Snoring Murder | గురకలు పెడుతున్నాడని గొడవ.. వ్యక్తి దారుణ హత్య!

Snoring Murder | పొరుగింటి వ్యక్తి గురకల వల్ల తనకు ఇబ్బంది కలుగుతోందని ఓ వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవ రోజూ జరిగేది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో.. ఆ వ్యక్తి స్వయంగా వెళ్లి రెండు ఇళ్ల మధ్య పూర్తి స్థాయిలో గోడ కట్టాలని వాదించాడు. దీంతో మళ్లీ గొడవ మొదలైంది. ఈసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వ్యక్తి హత్య చేయబడ్డాడు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని పెన్సిల్‌వేనియా రాష్ట్రంలో హాట్‌బోరో ప్రాంతానికి చెందిన రాబర్ట్ వాలెస్(62) తన పొరుగింట్లో నివసించే క్రిస్టోఫర్ కేసీ(55) పెట్టే గురకల వల్ల తనకు ఇబ్బంది కలుగుతోందని.. సమస్యను పరిష్కరించడానికి వెళ్లాడు. కానీ క్రిస్టోఫర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పోలీసుల వరకు వెళ్లింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు.

దీనంతటికీ కారణం.. రెండు ఇళ్ల మధ్య ఒకే దిశ వైపు కిటకీలున్నాయి. క్రిస్టోఫర్ బెడ్‌రూం ఎదురుగా పక్కింటి రాబర్ట్ బెడ్‌రూం కూడా ఉంది. దీంతో క్రిస్టోఫర్ పెట్టే గురకలు పక్కింటి రాబర్ట్‌కి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే ఆ ప్రాంతంలో చాలా కాలంగా రాబర్ట్ నివాసముంటున్నాడు. క్రిస్టోఫర్ మాత్రం కొన్ని నెలల క్రితమే ఇల్లు కట్టుకున్నాడు. దీంతో క్రిస్టోఫర్ తన ఇంటి కిటికీ మరో వైపు పెట్టుకోవాలని రాబర్ట్ వాదన. దానికి ‘నా ఇల్లు నా ఇష్టమంటూ’ .. క్రిస్టోఫర్ అంగీకరించలేదు.


ఈ నేపథ్యంలో జనవరి 15 సాయంత్రం 6.30 గంటలకు రాబర్ట్ కోపంగా క్రిస్టోఫర్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో క్రిస్టోఫర్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. రాబర్ట్ నేరుగా వెళ్లి క్రిస్టోఫర్ ఇంటి కిటికీని పగలకొట్టాడు. దీంతో క్రిస్టోఫర్ కోపం పట్టలేక రాబర్ట్‌పై దాడి చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో క్రిస్టోఫర్ తన ఇంట్లోని మిలిటరీ కత్తితో పలుమార్లు రాబర్ట్ కడుపులో పొడిచాడు.

రాబర్ట్ తీవ్ర స్రావంతో తిరిగి ఇంటికి వెళుతూ కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. రాబర్ట్‌ని ఆస్పత్రికి తరలించారు. కానీ అంతలోనే రాబర్ట్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి క్రిస్టోఫర్‌ని అరెస్టు చేశారు.

Snoring Murder, Man, kill, neighbour, Pennsylvania, sleep disturbance, homicide,

Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×