E-Paper
Advertisement

ఖమేనీ బతికే ఉన్నారా? ఇరాన్‌ను నడిపిస్తోంది ఎవరు? సంచలన నిజాలు బయటపెట్టిన దౌత్యవేత్త!

ఖమేనీ బతికే ఉన్నారా? ఇరాన్‌ను నడిపిస్తోంది ఎవరు? సంచలన నిజాలు బయటపెట్టిన దౌత్యవేత్త!
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొంతకాలంగా తలెత్తుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, దేశపాలనా వ్యవహారాలను క్రియాశీలకంగా పర్యవేక్షిస్తున్నారని సీనియర్ దౌత్యవేత్త, సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. గత వారంలోనే ఇరాన్ అధ్యక్షుడితో సుప్రీం లీడర్ దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారని పేర్కొన్నారు. పార్లమెంట్ స్పీకర్ కూడా తాము మోజ్తబాతో గంటల తరబడి సమావేశమైనట్లు చెప్పిన విషయాన్ని అబ్దుల్ మజీద్ గుర్తుచేశారు.

మరోవైపు తండ్రి అంత్యక్రియలకు కూడా మోజ్తబా హాజరు కాలేదన్న వార్తలను దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ ఖండించారు. భద్రతా రీత్యా మీడియాకు కనిపించకపోయినప్పటికీ ఆయన తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారని వెల్లడించారు. ‘నేను ఇరాన్‌లో ఉన్నప్పుడు ఆయన ఇద్దరు సోదరులను కలిశాను. మోజ్తబా కూడా అక్కడే ఉన్నారు. రాత్రి వేళల్లో ఆయన రహస్యంగా వీధుల్లోకి వచ్చి ప్రజల నిరసన ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు’ అని ఆయన తెలిపారు.

Advertisement

ఇదిలా ఉంటే ప్రాంతీయ యుద్ధం, ఆర్థిక సంక్షోభం మధ్య ఇరాన్‌ను ఎవరు నడిపిస్తున్నారనే దానిపై అమెరికా ఇటీవల సందేహాలు వ్యక్తం చేసింది. ఇరాన్ అగ్రనాయకత్వం అంతమైందని, ప్రస్తుతం ఆ దేశంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో ఎవరికీ తెలియడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చితో తాము చర్చలు జరుపుతున్నామని, అయితే వారికి నిర్ణయాధికారం ఎంతవరకు ఉందో స్పష్టత లేదని అన్నారు.

Also Read: మనుషులను వణికిస్తున్న ‘షమోండా వైరస్’.. తొలి మరణం నమోదు, అసలేంటీ వింత వ్యాధి?

Advertisement

అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఇరాన్ నిర్ణయాధికార వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, తమ ప్రతినిధులు ఎవరో అమెరికా అధికారులకు స్పష్టంగా తెలుసని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. యుద్ధ వాతావరణం, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, అగ్ర అధికారులతో నిరంతరం సమావేశమవుతూ దేశాన్ని నడిపిస్తున్నారని ఇరాన్ స్పష్టం చేసింది.

Also Read: భర్త సంపాదన నెలకు రూ.11 వేలు.. విడాకుల తరువాత భార్యకు నెలవారీ రూ.25000 చెల్లించాలన్న కోర్టు

Tags

Related News

ఐరాసలో పాకిస్థాన్‌కు గట్టి షాక్.. కార్గిల్ వార్ నిజాలు బయటపెట్టి తోలుతీసిన భారత్!

ట్రంప్ అల్లుడిపై సంచలన ఆరోపణలు.. యావత్ ప్రపంచమే షాక్.. ఈయన మామూలోడు కాదు!

టిబెట్‌లో భారీ భూకంపం.. వందలాది ఇళ్లు నేలమట్టం.. 18 మంది మృత్యువాత!

ఓరి నీ ప్రేమ మండిపోను.. ఎంత పని చేశావు, కౌగిలింతలో భార్య ఎముకలు విరిగాయి

బంగ్లా జంటకు సౌదీలో ఉరి.. ఢాకాకు సమాచారం ఇవ్వకుండానే, అసలు ఏం జరిగింది?

వలసలపై ట్రంప్‌ సర్కార్ ఉక్కుపాదం.. ఏకంగా 3 లక్షల వీసాల రద్దు, ఎక్కువగా ఎవరంటే..

ఫ్రెంచ్ విప్లవ గడ్డపై మళ్లీ అగ్గి.. ఇది నిరసనా? అంతర్జాతీయ కుట్రా?

Big Stories

Advertisement
×