Manas Nagulapalli:మానస్ నాగులపల్లి (Manas Nagulapalli).. సీరియల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన.. బిగ్ బాస్ సీజన్ 5లో ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఒకపక్క సీరియల్స్, రియాలిటీ షోలలో సందడి చేస్తూనే.. మరొక పక్క మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలలో కూడా నటిస్తూ మరింత బిజీగా మారారు.. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత ఊహించని ప్రజాధారణ సొంతం చేసుకున్న మానస్.. వ్యాపారవేత్త కుమార్తె శ్రీజ నిశ్శంకర్ రావును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లయిన ఏడాదికే పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చారు ఈ జంట. అయితే ఆ బిడ్డ ఇప్పుడు రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఏకంగా అరుదైన ఘనత సాధించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
రెండేళ్లు కూడా నిండకుండానే మానస్ నాగులపల్లి కుమారుడు ధ్రువ నాగులపల్లి (Dhruva Nagulapalli) అరుదైన ఘనత సాధించారు. కేవలం 1 ఏడాది 11 నెలల వయసులోనే జిమ్నాస్టిక్ లో ఫార్వర్డ్ రోల్స్ చేస్తూ తన అసాధారణ ప్రతిభను చాటుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు ఈ అరుదైన ప్రతిభతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి” సూపర్ టాలెంటెడ్ కిడ్” అనే బిరుదును కూడా అందుకున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి అద్భుతమైన ప్రతిభను కనబరచడం నిజంగా గర్వకారణం అని చెప్పాలి.
also read:టాస్క్ ఎఫెక్ట్.. స్పీడ్ పెంచిన నరేష్.. వారిద్దరిపై వేటు తప్పదా?
మానస్ తన కొడుకు ధ్రువ నాగులపల్లి ఈ అరుదైన ఘనత సాధించడంతో పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతూ ఈ అరుదైన క్షణాలను తన కొడుకు ధ్రువ నాగులపల్లి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ధ్రువ నాగులపల్లి తాను సాధించిన ఈ ఘనత గురించి ఇలా పంచుకున్నారు..” నా చిన్న ప్రయాణంలో ఒక గర్వించదగిన మైలురాయిని నేను చేరుకున్నాను. కేవలం ఒక సంవత్సరం 11 నెలల వయసులో ఫార్వర్డ్ రోల్స్ చేసినందుకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే “సూపర్ టాలెంటెడ్ కిడ్ – వన్ ఇన్ ఏ మిలియన్” అవార్డుతో గౌరవించబడ్డానని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు కేవలం 6 నెలల వయసు ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ తో నా ప్రయాణం ప్రారంభం అయింది.
నేను తరచూ మా నాన్నతో పాటు ఆయన జిమ్నాస్టిక్స్ తరగతులకు వెళ్లేవాడిని. కేవలం ఆయనతో వెళ్లడంతో మొదలైన నా ప్రయాణం క్రమంగా ఆ ఆటపై సహజమైన ఆసక్తి, ప్రేమ వికసించింది. నా ప్రతిభను గుర్తించి ఈ మైలురాయిని మరింత ప్రత్యేకంగా చేసినందుకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణంలో భాగమై ఈ ఆటపై నా ఆసక్తిని పెంపొందించడంలో సహాయపడిన జిమ్నాస్టిక్ మాస్టర్ రాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక చివరిగా నన్ను ప్రోత్సహించి.. నా చిన్న చిన్న ఆసక్తులను మరింత సరదాగా మార్చి ఈ విజయాన్ని నేను ఎప్పటికీ గుర్తించుకునే ఒక అందమైన జ్ఞాపకంగా మార్చిన మా అమ్మానాన్న , నా కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ షేర్ చేశారు. మొత్తానికైతే ఇంత చిన్న వయసులోనే ఈ అరుదైన ఘనత సాధించడం నిజంగా ప్రశంసనీయం అంటూ పలువురు అభిమానులు, సెలబ్రిటీలు కూడా ధ్రువ నాగులపల్లి పై ప్రశంసల కురిపిస్తున్నారు.