Saudi Prince Died: కొందరు బడాబాబులు ఎప్పుడు, ఎలా చనిపోతారో ఎవరీ తెలీదు. దానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా సౌదీ ప్రిన్స్ జలావి అల్ సౌద్ మృతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఆయన మృతి చెందాడు. దీనికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
లండన్‌లో సౌదీ ప్రిన్స్ మృతి-సౌదీ రాకుమారుడు అబ్దుల్లా బిన్ జలావి అల్ సౌద్ లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో మృత్యువాత పడ్డాడు. ఆయన వయస్సు కేవలం 29 ఏళ్లు. ఆయన కేసు దర్యాప్తు చేసిన అధికారులు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం, డ్రగ్స్, ఔషధాలు ఒకేసారి తీసుకోవడం వల్ల మృతి చెందినట్టు తేలింది. గతేడాది నవంబర్‌లో ఈ ఘటన జరిగింది.
లగ్జరీ హోటల్‌లో రాత్రి ఏం జరిగింది? ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు అధికారులు వివరాల ప్రకారం.. సౌదీ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్ గతేడాది విదేశీ పర్యటనకు వెళ్లాడు. నవంబర్‌లో లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఆయన స్టే చేశాడు. అయితే నవంబరు 25న హోటల్ గదిలో ఆయన స్పృహ కోల్పోయి కనిపించాడు.
భారీ ఎత్తున డ్రగ్స్-మద్యం-హోటల్ సిబ్బంది వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తేల్చారు. అబ్దుల్లా భారీగా మద్యం-డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ప్రిన్స్ అబ్దుల్లా రక్తంలో ప్రతి 100 మిల్లీ లీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. ఇంగ్లాండ్ చట్టబద్ధమైన డ్రింక్ అండ్ డ్రైవింగ్ పరిమితి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
సీసీటీవీ ఫుటేజ్‌లో ఏం బయటపడింది? మద్యంతోపాటు GHB అనే పార్టీ డ్రగ్‌ను తీసుకున్నాడని తెలిపారు. ప్రిన్స్ ఆత్మహత్యకు సంబంధించిన లేఖ గానీ, ఆ తరహా ఆలోచనలు వ్యక్తం చేసినట్లు ఎలాంటి సూచనలు లేవని కోర్టుకు వివరించారు. మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ప్రిన్స్ మరణానికి చివరి గంటలలో అతడు ఒంటరిగా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. మృతికి ముందు సాయంత్రం సిగరెట్ తాగడానికి బయటకు వెళ్తూ అందులో కనిపించాడు. ఈ ఆల్కహాల్ స్థాయి కోమాకు దారితీయగలదని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో మద్యం మానేయడానికి మెడిషిన్ వాడుతున్నాడు.
ALSO READ: ట్రంప్ కొత్త సుంకాంలు.. 60 దేశాలపై ప్రభావం, మరి భారత్ పై ప్రభావం ఎంత?
వైద్యులు సూచించిన మందులు ఒకేసారి తీసుకోవడంతో గుండెపోటుకు దారి తీసిందని వెల్లడించారు. సౌదీ ప్రిన్స్ అబ్దుల్లా మృతిని సౌదీ రాయల్ కోర్టు ధ్రువీకరించింది. రియాద్‌లోని వీఐపీ మసీదులో అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకటించింది. మద్యం నుంచి అలవాటు తప్పించుకునేందుకు గతేడాది ఆగస్టులో లండన్‌లోని రోహాంప్టన్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత క్లినిక్‌లో చేరాడు. అక్కడ వారానికి ఖర్చు ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.45 లక్షల వరకు ఉంటుంది.