E-Paper
Advertisement

ఏపీ ఓటర్ల జాబితాలో సంచలనం.. 44 లక్షల ఓట్లు గాయబ్? నేటి అర్ధరాత్రితో ‘సర్’ ప్రక్రియ క్లోజ్!

ఏపీ ఓటర్ల జాబితాలో సంచలనం.. 44 లక్షల ఓట్లు గాయబ్? నేటి అర్ధరాత్రితో ‘సర్’ ప్రక్రియ క్లోజ్!
Advertisement

Voter Survey: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన సమగ్ర ఓటర్ల సర్వే ప్రక్రియ నేటితో చివరి దశకు చేరుకుంది. ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారమ్స్ స్వీకరణ, వాటిని కంప్యూటరీకరించే కీలకమైన డిజిటలైజేషన్ ప్రక్రియలు ఇవాళ అర్ధరాత్రితో ముగియనున్నాయి.ఈ గడువు ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి నేరుగా ఫారమ్‌లను స్వీకరించడానికి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత అందిన ఫారమ్‌లతో పాటు సేకరించిన మొత్తం డేటాను రాత్రి 12 గంటలలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది.

ఇప్పటివరకు అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,62,517 మంది ఓటర్లు ‘అన్‌కలెక్టబుల్’ కేటగిరీలోకి చేరారు. అంటే వీరు నివసించే స్థలాల్లో అందుబాటులో లేకపోవడం లేదా సమాచారం లభించకపోవడం జరిగింది.
అధికారుల తెలిపిన వివరాలు ప్రకారం.. మరణించిన ఓటర్లు 15,16,986 మంది, చిరునామా గుర్తించలేనివారు 7,82,304 మంది, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లినవారు 14,27,257 మంది, రెండు వేర్వేరు చోట్ల ఓటు హక్కు ఉన్నవారు 7,27,187 మందిగా తెలిపారు.

Advertisement

ప్రస్తుతం బూత్ స్థాయి అధికారులు చివరి నిమిషం వరకు క్షేత్రస్థాయిలో ఉంటూ.. ఈ అన్‌కలెక్టబుల్ ఫారమ్‌ల వివరాలను వీలైనంత వరకు సేకరించి జాబితాను పక్కాగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అర్ధరాత్రి గడువు ముగిసిన తర్వాత తుది గణాంకాలపై స్పష్టత రానుంది.

Also Read: అర్ధరాత్రి రాత్రి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన 100 కుటుంబాలు.. అసలు ఏం జరిగింది?

Related News

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో రమా నందనా విచారణ.. ఏం జరిగిందంటే?

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×