E-Paper
Advertisement

ఇరాన్-అమెరికా యుద్ధం 100 రోజులు పూర్తి, విఫలమైతే నాశనం చేస్తామన్న ట్రంప్

ఇరాన్-అమెరికా యుద్ధం 100 రోజులు పూర్తి, విఫలమైతే నాశనం చేస్తామన్న ట్రంప్
Advertisement

Trump Again Warning: అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరానీయులను పిచ్చివాళ్లు అని సంబోధిస్తూనే, శాంతి చర్చల్లో తేడాలొస్తే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని బెదిరింపులకు దిగారు. తాము ఆ దేశంలోని చొరబడి యురేనియాన్ని తీసుకొస్తామని తేల్చి చెప్పారు.

ఇరాన్-అమెరికా యుద్ధానికి 100 రోజులు పూర్తి

Advertisement

ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఏదో జరుగుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. శక్తివంతమైన, ప్రమాదకరమైన అణ్వస్త్రాన్ని ఇరాన్ కలిగి ఉందన్నారు ట్రంప్. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచాన్ని నాశనం చేస్తారని, దాన్ని అడ్డుకుని ప్రపంచానికి సేవ చేస్తున్నట్లు శాంతి వచనాలు ప్రస్తావించారు.

ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి చాలా దగ్గరగా ఉందన్న ట్రంప్, ఒకవేళ అనివార్య కారణాల వల్ల డీల్ కుదరకుంటే ఇరాన్ ను సైనిక పరంగా దారుణంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇరాన్ ను నాశనం చేయడం చాలా సులువని, ఒప్పందంపై సంతకం కోసం ఇరాన్‌కు కొంత సమయం పడుతుందన్నారు.

Advertisement

చర్చలు విఫలమైతే ఇరాన్‌ను నాశనం చేస్తాం- ట్రంప్

ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉందని, ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పారు. తనకు సాగదీసే యుద్ధాలు నచ్చవని, అంతులేని యుద్ధం కాదన్నారు. మూడు నెలలుగా చేస్తున్నామని, ఇదంతా కాల్పుల విరమణ ఒప్పందం కిందకు వస్తుందన్నారు.

అదే సమయంలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం గురించి మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన నుండి బహిరంగంగా కనిపించని ఇరాన్ సుప్రీం మొజ్తాబా అలీ ఖమేనీ గురించి మాట్లాడారు ట్రంప్.

ALSO READ: రూటు మార్చిన ఇరాన్.. పొరుగుదేశాలపై దాడులు తీవ్రతరం, ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కన్ను

ఆయన తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసో లేదో చెప్పలేను, కానీ తెలిసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఇరాన్ ఇంకా ఈ ఒప్పందంపై ఎందుకు సంతకం చేయలేదనే విషయంపై మాట్లాడుతూ ఇది వారికి చాలా కష్టమైన విషయమని అన్నారు. వారికి వేరే మార్గం లేదని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు.

మరోవైపు ఇరాన్‌ దాడులకు స్పందించవద్దని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని ట్రంప్‌ గుర్తు చేశారు. ట్రంప్‌ ఎంత వారిస్తున్నా ఇజ్రాయెల్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. సోమవారం ఉదయం ఇరాన్‌ లక్ష్యంగా ఐడీఎఫ్‌ దళాలు దాడులు తీవ్రతరం చేశాయి. పశ్చిమ-మధ్య ఇరాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారీ దాడులకు దిగాయి. టెహ్రాన్‌లో పలుచోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి.

Related News

13 రోజుల బాంబుల వర్షం తర్వాత క్లైమాక్స్… ట్రంప్ నిర్ణయంతో మారిపోయిన సీన్!

సిరియాలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 35 మంది మృతి, 30 మందికి పైగానే గాయాలు

కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?

ఒకే ఇంట్లో భార్యాభర్తలు.. కానీ 20 ఏళ్లుగా మాటలు కట్.. ఎందుకో తెలిస్తే షాక్!

1100 రోజులుగా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్.. ‘మిస్ యూ డాడీ’ అంటూ.. కుమారుడు ఆసక్తికర పోస్ట్!

లగ్జరీ హోటల్‌లో రాత్రి ఏం జరిగింది? సౌదీ ప్రిన్స్ మృతి, వెలుగులోకి కీలక విషయాలు

ఇండియా సహా 60 దేశాలపై అమెరికా టారిఫ్స్ బాంబ్.. నేటి నుంచే అమలు.. అసలు కారణం ఇదే!

ట్రంప్ కొత్త సుంకాలు.. 60 దేశాలపై ప్రభావం, మరి ఇండియా మాటేంటి?

Big Stories

Advertisement
×