E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ సీన్ హైలెట్.. చందుకు దొరికిన శ్రీవల్లి.. ధీరజ్ ఇక జైల్లోనే..?

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ సీన్ హైలెట్.. చందుకు దొరికిన శ్రీవల్లి.. ధీరజ్ ఇక జైల్లోనే..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 8th : నా ధీరజ్ నీ ఎట్టి పరిస్థితులను బయటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని భద్ర వార్నింగ్ ఇస్తుంది. నా మేనల్లుడిని జైలుకు పంపిస్తాడా అలాంటి వాడి మీద పగ తీర్చుకున్నాను అని భద్ర అంటుంది. ధీరజ్ గాడు జైలు నుంచి బయటకు రావాలంటే ఒకటే మార్గం ఉంది.. నా మేనకోడలు వాడి కట్టిన తాళిని వాడి మొహానికి మళ్లీ నా ఇంట్లోకి అడుగు పెట్టాలి. అప్పుడే వాడిని రిలీజ్ చేస్తాను అని భద్ర అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతుంది.. మరి ధీరజ్ని రిలీజ్ చేయించేందుకు దూరం అవుతుందా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. ధీరజ్ పై ప్రేమను పెంచుకున్న ప్రేమ తన కోసం ఏదైనా చేయాలి అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. తనకోసం ఇంత చేసిన ధీరజ్ ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని నిర్ణయించుకుంటుంది.. కానీ ధీరజ్ ఉదయం నుంచి ఏమీ తినలేదని అతని కోసం పోలీస్ స్టేషన్ కి భోజనం తీసుకుని వెళుతుంది ప్రేమ.. ధీరజ్ నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి.. నిన్ను ఎవరు రమ్మన్నారు ప్రేమ ఇంత దూరం నువ్వు ఒక్కదానివే వచ్చావని అడుగుతాడు.. నువ్వు ఉదయం నుంచి ఏం తినలేదు కదరా ఇది భోజనం చేయాలి అని ప్రేమ అనగానే.. ఎమోషనల్ అయిపోతాడు. వీరిద్దరి ఎమోషనల్ సీన్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది..

కన్నీళ్లు పెట్టించే సీన్..

వేదవతి నర్మదా మాట్లాడుకున్న మాటలు విన్న ప్రేమ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.. తనవళ్లే అంతా జరిగింది అని బాధ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ధీరజ్ని బయటికి తీసుకురావాలి అని ఫిక్స్ అయిన ప్రేమ తీరం కోసం భోజనం తీసుకొని జైలుకు వెళుతుంది.. ప్రేమను చూసిన ధీరజ్ ఈ టైంలో నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావే? ఇంత రాత్రిపూట నువ్వు భోజనం తీసుకుని వచ్చావా? ఎందుకు వచ్చావే అని ధీరజ్అడుగుతాడు. దానికి ప్రేమ నువ్వు ఇక్కడ కష్టపడుతూ ఉంటే నేను అక్కడ ఎలా సంతోషంగా ఉంటాను రా.. నువ్వు లేని ఆ ఇల్లు నాకు నరకం గా అనిపిస్తుంది.. ఎక్కడ ఉన్నా నీతోనే ఉండాలి అని అనిపిస్తుంది అని ఎమోషనల్ గా ప్రేమ మాట్లాడడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. ప్రేమ నావల్ల ఇదంతా జరిగింది అని ఎంతగా బాధపడుతుందో చూసిన ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితానికి ఒక అర్థం ఉంది అని అంటుంది.. ఎమోషనల్ సీన్ ఎపిసోడ్ కి హైలెట్ అవడంతో పాటు అందరినీ కన్నీళ్లు పెట్టేస్తుంది.

చందుకు అడ్డంగా దొరికిన వల్లి..

Advertisement

ధీరజ్ ఇంకా జైలు నుంచి బయటికి రాడు. ఈ పొట్టి మిరపకాయ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అని వల్లి చాలా సంతోషంగా ఉంటుంది.. ఇక ఇంటికి నేనే రాజు నేనే మంత్రి అని శ్రీవల్లి చాలా సంతోషంగా గంతులు వేస్తూ ఉంటుంది.. అయితే సుకన్య భోజనం తినిపిస్తూ ఉండగా నువ్వు ఇలా ఎగురుతూ గంతులు వేస్తున్నామని తెలిస్తే.. ఒకవేళ ఎవరైనా చూస్తే నీ పని అంతే కడుపుతో ఉండి మరిది అరెస్ట్ అయ్యాడు అని బాధ కూడా లేకుండా ఎగురుతున్నావని నువ్వు పుట్టింటికి పంపించేస్తారు అని అనగానే… వెనకాల చందు కనిపించడం చూసి సుకన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నేను అడ్డంగా ఇరుక్కున్నాను అని మళ్లీ అనుకోగానే ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి చందు దగ్గర నాటకాలు మొదలు పెడతారు..

వల్లి మాటతో బయటకు వెళ్లిన చందు..

శ్రీవల్లి భోజనం వద్దని ఎంత చెప్తున్నా సరే బావా ఈ సుకన్య నా చేత భోజనం తినిపించాలని ప్రయత్నం చేస్తుంది.. నా బిడ్డ లాంటి మరిది అరెస్టు అయ్యాడని నాకు భోజనం ఎలా సహిస్తుంది చెప్పు బావ అని ఒక పెద్ద డ్రామా అని మొదలు పెడుతుంది.. ఆ డ్రామాని చూసిన చందు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని కూడా మాట్లాడకుండా చందు మౌనంగా బయటికి వెళ్లడంతో నా మీద ఏమైనా అనుమానం వచ్చిందని శ్రీవల్లి అనుకుంటుంది.. నీ మీద ఒకవేళ అనుమానం వచ్చుంటే వెళ్లి పుట్టింట్లో వదిలిపెట్టేవాడు కదా అట్లా లేదంటే వినలేదని అర్థం కదా అని సుకన్య అంటుంది..

కొడుకుకోసం కన్నీళ్లు పెట్టుకున్న బుజ్జమ్మ..

Advertisement

వేదవతి కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది.. ధీరజ్ ని ఇలాంటి పరిస్థితులు చూస్తారని అస్సలు అనుకోలేదు అని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండగా రామరాజు భోజనం తీసుకొని వేదవతి దగ్గరికి వస్తాడు. నేను అన్నాను అంటే అన్నాను అంటారు కానీ మీరు కూడా తినలేదు కదా మీకు కొడుకు.. మీద ప్రేమ ఉన్నప్పుడు నాకు నా కొడుకు మీద ప్రేమ ఉండదని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అసలు ధీరజ్ అమాయకుడండి వాడు ఇలాంటి తప్పు చేశాడంటే నేను అసలు నమ్మలేను.. జైల్లో వాడు మగ్గిపోతుంటే నేనెలా సంతోషంగా భోజనం చేస్తాను అని వేదవతి బాధపడుతూ ఉంటుంది ఆమె బాధను చూసినా రామరాజు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు..

సేనాను చంపబోతున్న రామరాజు..

చందు తన అమ్మానాన్న బాధను చూసి చాలా బాధపడిపోతాడు. వాళ్ల దగ్గరికి వెళ్ళగానే రామరాజు వారి పెద్దోడా ఎమ్మెల్యేతో మాట్లాడతాను అన్నావు కదా మాట్లాడవా.. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు అని అడుగుతాడు. మాదకద్రవ్యాల కేసు కదా నాన్న అసలు బయటికి రావడం కూడా కష్టమే అని అంటున్నారు. ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం లేదు అని అనగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. నీ కొడుకు నీ జీవితాంతం జైల్లోనే ఉంచుతాను అని సేన అన్న మాటలు గుర్తు చేసుకొని అతని చంపడానికి వెళ్తాడు.. అతని మీద కత్తితో దాడి చేస్తాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపడంతో రామరాజు కంట్రోల్ అవుతాడు.. తిరుపతి వచ్చి రామరాజు ని తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు.

పుట్టింటికి వెళ్లిపోయిన ప్రేమ..

ప్రేమ ఇదంతా తన వల్లే జరిగింది అని బాధ పడిపోతూ ఉంటుంది. నేనే గనక వాడి దగ్గర లేకున్నా అంటే వాడు సంతోషంగా ఉంటాడు కదా అని ఉదయం లేవగానే ప్రేమ రెడీ అయ్యి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది.. బయట సుకన్య అది చూసి ప్రేమ వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతుంది అని వల్లితో చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వల్లితో చెప్పగానే వల్లి నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచి సంతోషంగా ఉంటుంది. ప్రేమ కోసం వెతుకుతూ వెళ్ళిన నర్మదా ప్రేమ తన పుట్టింటికి వెళ్లడంతో అక్కడికి వెళుతుంది.. తన పుట్టింట్లోకి అడుగుపెట్టిన ప్రేమ నేను వచ్చేసాను అత్త అని అనగానే.. భద్ర చాలా సంతోషంగా ఉంటుంది నర్మద మాత్రం షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టించే సీన్.. కమల్ దెబ్బకు పల్లవి అవుట్..

Related News

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Big Stories

Advertisement
×