BigTV English

Coconut :- కలలో కొబ్బరికాయ కనిపించిందా..?

Coconut :- కలలో కొబ్బరికాయ కనిపించిందా..?


Coconut :- మనిషి నిద్రపోయినప్పుడు ఎన్నోకలలు వస్తుంటాయి. ఆ కలల్లో కొన్ని పీడకలలు, మరికొన్ని మంచివి కూడా ఉండొచ్చు. కలలపై ఎన్నెన్నో పుస్తకాలు కూడా రాశారు. కలలపై అధ్యయనాలు జరిగాయి. వందకి 90 శాతం కలలు మనకు గుర్తుండవు. కాని కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి. అలాంటి కలల గురించి కూడా శాస్త్రాల్లో ప్రస్తావించారు…


మనం ఏవిధంగా ఆలోచనలో ఉంటామో అవే ఆలోచనలు మన మనసుల్లో మెదులుతూ ఉంటాయి. ఎక్కువగా ఏ విషయాలు ఆలోచిస్తామో అంతర్లీనంగా అవి మెదడులో రింగ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారజామున వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు చెబుతుంటారు. అది నమ్మేవాళ్ల నమ్మికను బట్టి ఉంటుంది. నిద్రలో వచ్చే కలలకు అర్ధం ఉండవని కూడా అంటారు. చాలా తక్కువ మంది కలలో కొబ్బరికాయను చూస్తారట.. నారికేళాన్ని స్వప్నంలో చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు.

కొబ్బరి కాయ కొడుతున్నట్టు కల వస్తే రాబోయే రోజుల్లో మీరు మంచి పనులు చేస్తారని సంకేతమట. ఇంట్లో శుభకార్యాలు ప్రారంభం అవబోతున్నాయనడానికి ఈ కల సూచికగా భావిస్తారు. కొబ్బరికాయలు వేలాడినట్టు కలలో కనిపిస్తే కుటుంబంలో ఐక్యత ఎక్కువగా ఉంటుందని సంకేతమట. ఎలాంటి సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉంటారు. అనారోగ్యంతో బాధపడే వారికి ఇది శుభసంకేతం. వారు త్వరగా సమస్య నుంచి బయటపడతారట.

పగిలిన కొబ్బరికాయ స్వప్నంలో కనిపిస్తే త్వరలోనే ఏదో మంచి జరగబోతుందనడానికి ముందస్తు చిహ్నంగా భావించాలి. భవిష్యతులో, అంటే రాబోయే రోజుల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పచ్చి కొబ్బరి కనిపించే వారికి ఏదైనా రంగంలో విజయం సాధిస్తారు. మీకు మంచి జరుగుతుందని సంకేతం. ఒకోసారి ఇది ఆలస్యం కూడా కావచ్చు.

Tags

Related News

Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే.. ముందు వీటిని అస్సలు ఇంట్లో ఉంచొద్దు

Diwal 2025 Telugu Calendar: తెలుగు క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడో తెలుసా.. కరెక్ట్ డేట్ ఇదే

Ganesh Chaturthi 2025: వినాయకుడిని 21 పత్రాలతోనే.. ఎందుకు పూజించాలి ?

Mangalwar Ke Upay: చెడు దృష్టి పోవాలంటే.. మంగళవారం ఈ పరిహారాలు చేయండి చాలు !

Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి లడ్డూ ప్రసాదం.. సింపుల్ రెమెడీ.. తింటే వావ్ అనాల్సిందే

Big Stories

×