BigTV English

9K Gold: బంగారం రేటు పెరుగుతోందని భయపడకండి.. 9 క్యారెట్ గోల్డ్ వచ్చేసింది

9K Gold: బంగారం రేటు పెరుగుతోందని భయపడకండి.. 9 క్యారెట్ గోల్డ్ వచ్చేసింది

బంగారం రేటు రోజు రోజుకీ పెరిగిపోతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకి ఆల్రడీ చేరిపోయింది. కానీ పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లో బంగారం తప్పనిసరి. మధ్యతరగతి వర్గాన్ని బంగారం రేటు కలవరపెడుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయం ఏంటి? ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. 9 క్యారెట్ గోల్డ్ ని BIS హాల్‌మార్కింగ్ వ్యవస్థలో భాగం చేసింది.


బంగారం ప్యూరిటీ..
బంగారం ప్యూరిటీని క్యారెట్ లలో కొలుస్తారు. 24 క్యారెట్(24K) బంగారం అంటే అత్యంత శుద్ధమైనది అని అర్థం. అయితే ఆభరణాల తయారీకి ఇంత శుద్ధమైన బంగారాన్ని వాడలేం. దాంట్లో ఇతర లోహాలు కలిపితేనే అది ఆభరణంగా మారుతుంది. ఆ కలబోత వల్ల బంగారం ప్యూరిటీ 23 లేదా 22 క్యారెట్ లకు తగ్గిపోతుంది. అంటే 24 భాగాలలో కేవలం 22 భాగాలు మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 2 భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. దీనిని అధికారికంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్కింగ్ ధృవీకరిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 24K, 23K, 22K, 20K, 18K, 14K ప్యూరిటీలో బంగారం లభిస్తోంది. వీటికి BIS హాల్ మార్కింగ్ తప్పనిసరి. ఇకపై 9Kని కూడా BIS హాల్ మార్కింగ్ జాబితాలోకి తీసుకొచ్చింది కేంద్రం.

ఎందుకీ మార్పు..
ఇటీవల బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో అత్యంత గరిష్ట స్థాయికి చేరుకోవడంతోపాటు, బంగారు కడ్డీలపై అమెరికా సుంకం విధించాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత మార్కెట్ లో రేటు భారీగా పెరిగిపోయింది. పెట్టుబడిదారుల సంగతి సరే, కానీ వినియోగదారులు కొనుగోలు చేయడానికి కూడా భయపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారుగా ఉన్న భారత్ లో ఇటీవల బంగారం అమ్మకాలలో 60 శాతం తగ్గుదల నమోదైంది. పరిస్థితి తీవ్రతకు ఇది అద్దంపడుతోంది. కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే బంగారం కొంటే దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఉండదు. సామాన్య వినియోగదారుల్ని కూడా బంగారంవైపు ఆకర్షించడానికే ఈ కొత్త ప్రయత్నం.


9K ఎలా ఉంటుంది?
దాదాపుగా బంగారం కొనుగోలు చేసేవారందరికీ 24 క్యారెట్, 22 క్యారెట్ గురించి తెలుసు. 18 క్యారెట్ బంగారంతో తయారయ్యే ఆభరణాలు కూడా మార్కెట్ లో ఉన్నాయి. అయితే వాటి రంగు విషయంలో అప్పుడే తేడా తెలిసిపోతుంది. దుకాణదారులు బంగారం ప్యూరిటీ గురించి చెప్పే వాటిని విక్రయిస్తుంటారు. తాజాగా బంగారం రేటు పెరిగిపోవడంతో మరింత ప్యూరిటీ తగ్గించి అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 24K బంగారం ప్రస్తుతం గ్రాముకు రూ. 10,000 లేదా 10 గ్రాములకు రూ. 1,00,000 ను దాటిపోగా.. 9K బంగారం గ్రాము రూ. 3,700 లేదా 10 గ్రాములు రూ. 37,000 వద్ద లభిస్తుంది. అయితే ఇప్పటి వరకు 9K గోల్డ్ అమ్మకం అధికారికం కాదు. దీనికోసం ప్రభుత్వం BIS నిబంధనలు మార్చింది. BIS సవరణ- 2 ప్రకారం 375 ppt స్వచ్ఛతతో ఉండే 9K బంగారానికి ఇకపై తప్పనిసరి హాల్‌మార్కింగ్ తోనే విక్రయించాల్సి ఉంటుంది. దీనివల్ల బంగారం కొనుగోళ్లు మరీ పడిపోకుండా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పండగల సీజన్ దగ్గరకు వస్తోంది, పెళ్లిళ్ల సీజన్ కూడా ముందే ఉంది. ఇలాంటి టైమ్ లో 9K బంగారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. దీపావళి నాటికి బంగారం డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.

Related News

Gold Rate Dropped: సామాన్యులకు గుడ్ న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

రియల్ ఎస్టేట్ రంగంలో మురళీ మోహన్ కు హీరో శోభన్ బాబు చెప్పిన సక్సెస్ సీక్రెట్స్ ఇవే..

Gold in smartphones: స్మార్ట్‌ఫోన్‌లో బంగారం ఉందని తెలుసా? ఈ మోడల్స్ లో మరీ ఇంత ఉంటుందా!

ఈ వయస్సు దాటిన ప్రతీ భారతీయుడికి రూ. 5 లక్షల ప్రయోజనం అందించే స్కీం ఇదే..

కేవలం రూ. 24కే టాక్స్ ఫైలింగ్…జియో బంపర్ ఆఫర్..సింపుల్ గా ఇలా ఫైల్ చేయండి..

Big Stories

×