Bigg Boss AgniPariksha E3 Promo1: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పించడానికి బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 5వ తేదీ నుండి స్ట్రీమింగ్ కి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా మొత్తం 5 మంది సామాన్యులను హౌస్ లోకి తీసుకురావడానికి అగ్నిపరీక్ష పేరుతో ఒక మినీ షో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సామాన్యుల నుండి 20వేలకు పైగా అప్లికేషన్లు రాగా.. ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు ఈ 45 మందిలో 15 మందిని సెలెక్ట్ చేసి.. వీరికి అగ్నిపరీక్ష అంటూ ఒక షో నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 5 మందిని ఎంపిక చేసి హౌస్ లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో..
జియో హాట్ స్టార్ వేదికగా ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు ఎక్స్క్లూజివ్ గా ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష మినీ షోకి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్ (Navadeep ),బిందు మాధవి (Bindu Madhavi) అభిజిత్ (Abhijeet) జడ్జిలుగా వ్యవహరించగా.. ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Sree mukhi) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వగా రెండో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఎక్కువగా సామాన్యులు ఎమోషనల్ అవుతూ.. తమ బాధను ఎక్స్ప్రెస్ చేయడం హైలెట్ గా నిలిచింది.
ప్రోమో వైరల్..
ప్రోమో విషయానికి వస్తే.. ఒక వ్యక్తి స్టేజ్ పైకి రాగానే శ్రీముఖి నీకు పెళ్లయిందా? అని అడుగుతుంది. అయ్యింది అంటే ఎందుకు చేసుకున్నావు అని మళ్లీ ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత నవదీప్ మాట్లాడుతూ.. నన్ను కూడా చాలామంది ఇలాగే అంటారు శ్రీముఖి అంటూ కామెంట్లు చేశారు. శ్రీముఖి మాట్లాడుతూ మీ నాన్నతో మాట్లాడలేని సందర్భం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించగా.. ఆ కంటెస్టెంట్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. ముఖ్యంగా తన తండ్రిని తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నట్టు చూపించగా.. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావని మళ్లీ శ్రీముఖి తిరిగి ప్రశ్నించింది. అతడి మాటలు చూసే ఆడియన్స్ కి కూడా కన్నీళ్లు తెప్పించాయని చెప్పవచ్చు.
ఎమోషన్స్ తో కట్టిపడేస్తున్న సామాన్యులు..
తర్వాత ఇంకొక కంటెస్టెంట్ స్టేజ్ పైకి రాగా.. నీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి? నీకు లవర్ ఉన్నాడా? అని బిందు మాధవి ప్రశ్నిస్తే.. నేను ఆడ నవదీప్ అంటూ కామెంట్ చేసింది. నేను సింగిల్ అని ఎక్కడా చెప్పట్లేదే అని నవదీప్ అంటే.. నేను కూడా చెప్పుకోవట్లేదు అంటూ నవదీప్ కి కౌంటర్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇలా ఎవరికివారు తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా అటు ఎమోషనల్ కామెంట్లతో కూడా కట్టిపడేశారు.
ALSO READ:Bigg Boss: 12 ఏళ్ల కూతురు సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?