Diwal 2025 Telugu Calendar: దీపావళి అంటే కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు. ప్రతి ఇంటికి ఆనందం, శుభం, సంపద, కొత్త ఆరంభానికి సంకేతం. మనం ప్రతీ సంవత్సరం చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళిని వేడుకగా జరుపుకుంటాము, కానీ ఈ పండుగ తెలుగు క్యాలెండర్ ప్రకారం 2025లో ఏ రోజున వస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తిగా మారింది. దీపావళి తేదీ, పండుగ ప్రత్యేకతలు, దీపావళి వెనుక ఉన్న కథలు, ప్రతి ఇంటికి ఇచ్చే శుభ ఫలితాలను తెలుసుకుందాం.
2025లో దీపావళి ఎప్పుడు వస్తుంది?
మన దేశంలో దీపావళిని ఐదు రోజులు జరుపుకుంటారు. అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ఆధారంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్, నవంబర్ మధ్య జరుగుతుంది. అక్టోబర్‌లో 1వ రోజు ధన్తేరస్ 18న, 2వరోజు నరక చతుర్దశి 19న, 3వ రోజు దీపావళి 20, 4వ రోజు గోవర్ధన్ పూజ 21, 5వ రోజు భాయ్ దూజ్ ఇలా ఐదు రోజులు ఘనంగా జరుపుకుంటారు. అంటే 2025లో దీపావళి అక్టోబర్ 20న వస్తుంది. హిందూ క్యాలెండర్ నెల కార్తీకం 15వ రోజు, అమావాస్య రోజును పిలుస్తారు. ఇది దీపావళి ప్రారంభానికి సూచనగా పిలుస్తారు
దీపావళి వెనుక ఉన్న ముఖ్య కారణాలు
నరకాసుర వధ, శ్రీరాముడు అయోధ్య, లక్ష్మీ పూజ, శ్రీకృష్ణుడి చేతిలో నరకాసురుడు చంపబడిన రోజున, ప్రజలు సంబరాలు జరుపుకుంటారు, ఇదే దీపావళిగా మారింది. అంతే కాదు శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు, ఆ ఆనందాన్ని గుర్తుచేసుకోవడానికి దీపావళి జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా సంపద, శ్రేయస్సు కోసం మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ కారణాలన్నీ కలిసి దీపావళిని భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగగా మార్చాయి.
Also Read: Shobha Shetty: రంగురంగుల చీరలో శోభా శెట్టి వయ్యారాలు.. హరివిల్లులా నడుము వంపులతో మాయ చేస్తున్న భామ
దీపావళి రోజు నరకాసుర వధ
నరకాసురుడు భూమి, వరాహ కుమారుడు. అతను ప్రాగ్జ్యోతిష అనే రాజ్యానికి రాజు. నరకాసురుడు చాలా శక్తివంతుడు, దుర్మార్గుడు. అతను ప్రజలను చాలా బాధ పెట్టేవాడు. అంతేకాదు 16,100 మంది స్త్రీలను బంధించాడు. అతని ఆగడాలు ఎక్కువవడంతో, ప్రజలు విష్ణువును ప్రార్థించారు. దీంతో విష్ణువు తన అవతారమైన శ్రీ కృష్ణుడిని నరకాసురుడిని సంహరించమని ఆదేశించాడు. శ్రీ కృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు. నరకాసురుడు చాలా శక్తివంతుడు కావడంతో, శ్రీ కృష్ణుడికి కూడా చాలా కష్టమైంది. అప్పుడు సత్యభామ నరకాసురుడిని సంహరించింది. నరకాసుర వధ దుష్టశక్తులపై విజయం. నరకాసుర వధ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. నరకాసురుడిని సంహరించిన తర్వాత, ప్రజలు సంతోషంతో దీపావళి పండుగను జరుపుకున్నారు.
కొడుకు దారితప్పితే తల్లి క్షమించదని సత్యభామ నిరూపించింది. ధర్మాన్ని కాపాడటానికి రాగద్వేషాలకు అతీతంగా ఆదర్శ దంపతులుగా శ్రీ కృష్ణుడు, సత్యభామ నిలిచిపోయారు. ఈ గాథ హరివంశలో ఉంది. అందుకే దీనికి ప్రతీకగా దీపావళి పండగలో అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నుంచే దీపం పెట్టడం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే యమదీపం కూడా పెట్టడం మొదలవుతుంది. ఈ పండగకు ఇంటికి వచ్చే పితృదేవతలకు మార్గం చూపుతుందని ప్రజలు నమ్ముతారు.
శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు..
శ్రీ రామచంద్రుడు 14 సంవత్సరాల వనవాసం పూర్తిచేసి, చెడును అధిగమించి, అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును ప్రతీకగా దీపావళి జరుపుకుంటారు. దీనికి ప్రతీకగా ఈ రోజు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి, బాణసంచాలు కాల్చి, ఆడబిడ్డలకు బహుమతులు ఇవ్వడం, నూతన వస్త్రాలు ధరించడం, పిండివంటలు, మిఠాయిలు తయారు చేయడం జరిగే సంప్రదాయం. ఈ అన్ని ఆచారాలు ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్ధిక శుభాన్ని సూచిస్తాయి. దీవాళి రోజు వాణిజ్య వ్యవహారాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, భవిష్యత్తు విషయంలో దీపావళి శుభ ప్రతీకగా నిలుస్తుంది. చీకటిలో వెలుగు, చెడుపై మంచి, సంతోషం, శాంతి అన్నీ కలిసిన ఈ పండుగ, ప్రతి ఒక్కరికి జీవితంలో వెలుగు, ఆశ, విజయాన్ని ఇస్తుందని విశ్వాసం.