Actor Naresh : టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ మధ్య హీరోలకు హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్ చేస్తూ పాపులర్ అయ్యాడు. నరేష్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఈయన మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కన్నడ నటి పవిత్ర లోకేష్ ను ఇటీవల ఆయన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నరేష్ పవిత్రలు సొంతంగా ఒక ఇంటిని కట్టుకున్నారు. ఆ కొత్తింటి గృహప్రవేశం ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
ఐదు ఎకరాల్లో నరేష్ కొత్తిల్లు..
సీనియర్ నటుడు నరేష్ ఈమధ్య ఏదో ఒక విషయంలో హైలెట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు.. నటుడిగా అతడి ఎంపికలే కాదు, ఇప్పుడు అభిరుచి మేరకు తన కొత్త ఇంటిని నిర్మించుకున్న తీరు కూడా చర్చగా మారింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఆయన మరో ఇంటివాడయ్యాడు. ఐదెకరాల్లో రాజభవనం లాంటి అద్భుతమైన ప్యాలెస్ నిర్మించాడు. ఈ ఇంటికి ఎంట్రన్స్ మొదలు, మాస్టర్ బెడ్ రూమ్ లు, కిచెన్, జిమ్ స్పేస్, వరండాలు.. ఇలా ఒక్కటేమిటి అడుగున ఆ ఇంటిని చూస్తే ఇంద్ర భవనం తలపిస్తుంది. ఇటీవలే ఏంటి ని సినీ ప్రముఖుల అందరికీ చూపిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also Read : చందును మోసం చేసిన భాగ్యం.. తిరుపతిని ఆడుకున్న అల్లుడ్లు.. నర్మదకు బిగ్ షాక్..
నరేష్ మొత్తం ఆస్తుల విలువ..
నటుడు నరేష్ సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బాగానే సంపాదించాడు. ఇప్పటివరకు ఆయన ఆస్తి 400 కోట్లకు పై మాటే అని తెలుస్తుంది. అంతేకాదు విజయనిర్మల సంపాదించిన విప్రో సర్కిల్ సమీపంలోని 5 ఎకరాల ఫాం హౌస్ ఖరీదు సుమారు 300 కోట్లు. ఇక మొయినాబాద్, శంకరపల్లి దగ్గర లో సుమారు 30 ఎకరాల మేర ఫాం హౌస్ లు ఉన్నాయి. వీటి ఖరీదు 100 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పుడు భాగ్యనగరం నడిబొడ్డున ఖరీదైన ఇల్లు కట్టడంతో ఆయన ఆస్తులు మరింత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. నరేష్ పవిత్ర ఇద్దరు బిజీ యాక్టర్స్… నరేష్ కు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆస్తులు ఉంటే.. అటు పవిత్ర లోకేష్ కూడా కర్ణాటకలో ఆస్తులను సంపాదించినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే, ఇప్పుడు వీరిద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా నరేష్ ఇండ్లు అద్భుతం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి…
నటుడు నరేష్ ఇంటిని చూశారా ? ఇంద్రభవనమే.. #Naresh #PavitaLokesh #LuxuryHome @ItsActorNaresh pic.twitter.com/zwr0DhcRBB
— Megha (@MovieloverMegha) August 23, 2025