BigTV English

Lasya Priya Temple :- భక్తురాలి అత్తని శంపించిన దేవత.. సాక్ష్యమిదిగో…

Lasya Priya Temple :- భక్తురాలి అత్తని శంపించిన దేవత.. సాక్ష్యమిదిగో…


Lasya Priya Temple :- కర్ణాటకలోని హసన్ లోని లాస్యప్రియ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. చాముండి దేవత హసన్ అందాలకి మెచ్చి ఈ ప్రాంతాన్ని నిలయంగా మార్చుకోవడమే లాస్యదేవి ఆలయం ప్రత్యేకత. మూడు చీమల పుట్టలను అమ్మవారు తమ ఆవాసంగా మార్చుకున్నారని పురాణగాధలు చెబుతున్నాయి. అందుకే అమ్మవారి రూపం కూడా మూడు పుట్టల్లాగానే కనిపిస్తుంది. పెద్ద బొట్టుతో మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. ఒకసారి పెట్టిన దీపం ఏడాదిపాటు అలాగే వెలుగుతూ ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. నెయ్యితో వెలిగించిన ఏడాదిపాటు జ్యోతి రూపంలో వెలుగుతూనే దర్శనమిస్తుంది.


అమ్మవారి ఆలయంలో ఇక్కడ పెట్టిన ఏ పూవు ఏడాదియైనా వాడిపోవడం మనం చూడటం లేం. అమ్మవారికి పెట్టిన ప్రసాదం కూడా ఎంత కాలమైనా రంగు, రుచి చెదిరిపోదు. అంతే కాదు ఏడాదికి ఒక్కసారి మాత్రమే హసనాంబ దర్శనం కలుగుతుంది. దీపావళి సమయంలో మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి వారం రోజులపాటు తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో అమ్మవారికి వండి పెట్టే అన్నం ఏడాది తర్వాత చూసినా అలాగే ఉంటుంది. ఏమాత్రం పాడవదు. ఎవరైనా సరే నిరంభ్యంతరంగా తినచ్చు. దేవీ విగ్రహానికి ఎదురుగా శివుడు లింగరూపానికి భిన్నంగా మనుష్య రూపంలో దర్శనమిస్తుంటాడు.365 రోజుల్లో కేవలం 7 రోజులు మాత్రమే ఆలయం తెరుచుకుంటుంది. అప్పుడు మాత్రమే అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఇంత విశిష్టత ఉంది కాబట్టే దేశం నాలుగు వైపుల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. పుట్ట రూపంలో లాస్యదేవి దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. లాస్యప్రియ ఆలయంలో పదితలలతో ఉన్న రావణుడు ఉండటం విశేషం. వీణ వాయిస్తూ కనిపిస్తాడు.

ఒక భక్తురాలిని ఆమె అత్త వేధించడంతో అమ్మవారి శాపం వల్ల అత్త బండరాయిగా మారిందట. అందుకు సాక్ష్యం కూడా ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ బండరాయి తిరిగి అమ్మవారి దగ్గరికి చేరినప్పుడు కలియుగాంతం అవుతుందని నమ్మకం ఉంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని చెప్పిన అందుకు తగ్గ శాస్తీయ ఆధారాలైతే ఏమీ లేవు.

Tags

Related News

Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే.. ముందు వీటిని అస్సలు ఇంట్లో ఉంచొద్దు

Diwal 2025 Telugu Calendar: తెలుగు క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడో తెలుసా.. కరెక్ట్ డేట్ ఇదే

Ganesh Chaturthi 2025: వినాయకుడిని 21 పత్రాలతోనే.. ఎందుకు పూజించాలి ?

Mangalwar Ke Upay: చెడు దృష్టి పోవాలంటే.. మంగళవారం ఈ పరిహారాలు చేయండి చాలు !

Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి లడ్డూ ప్రసాదం.. సింపుల్ రెమెడీ.. తింటే వావ్ అనాల్సిందే

Big Stories

×