Bigg Boss: ప్రస్తుతకాలంలో సినీ ఇండస్ట్రీలో రెండు, మూడు పెళ్లిళ్లు చాలా సహజం అయిపోయాయి. ముఖ్యంగా తమ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోలేక.. వైవాహిక బంధంలో వచ్చే సమస్యలను అధిగమించలేక చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకొని వేరుపడిన తర్వాత మళ్లీ కొత్త తోడు వెతుక్కుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. అయితే ఇక్కడ ఏకంగా ఒక హీరోయిన్ 12 ఏళ్ల కూతురు సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోవడం వైరల్ గా మారింది. నిజానికి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నా.. తమకు నచ్చిన వారిని భాగస్వామిగా ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అది మెచ్యూర్డ్ యువత సమక్షంలో వివాహం చేసుకోవడం పెద్దగా అనిపించదు. కానీ ఇక్కడ 12 ఏళ్ల అమ్మాయి ముందే పెళ్లి చేసుకోవడంతో నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
12 ఏళ్ల కూతురు సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులను ఇంకొక భాగస్వామితో చూడడానికి అసలు ఒప్పుకోరు.. కానీ ఇక్కడ 12 ఏళ్ల అమ్మాయి మాత్రం సంతోషంగా దగ్గరుండి మరీ తన తల్లికి పెళ్లి జరిపించింది. మరి కూతురు సమక్షంలో వివాహం చేసుకున్న ఆ నటి ఎవరు ? ఎవరిని వివాహం చేసుకుంది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఆమె ఎవరో కాదు ఆర్య.ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేసింది. మలయాళం నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇక ఇప్పుడు తాను మెచ్చిన వ్యక్తిని తన కూతురి సమక్షంలో రెండోసారి పెళ్లి చేసుకుంది.
కొరియోగ్రాఫర్ తో పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్..
ప్రముఖ కొరియోగ్రాఫర్ సిబిన్ బెంజమిన్ తో కలసి ఏడడుగులు వేసింది. ఇది ఇద్దరికీ రెండో వివాహమే కావడం గమనార్హం. ఈ యేడాది మేలో వీరి నిశ్చితార్థం జరగగా.. ఇప్పుడు ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆర్య – సిబిన్ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే ఇక్కడ హైలెట్ ఏంటంటే.. ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడమే కాకుండా.. తన తల్లిని స్వయంగా మండపానికి తీసుకొచ్చింది.. అంతేకాదు తల్లి మెడలో మూడు ముళ్ళు పడుతుంటే సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ప్రస్తుతం ఈ పాప ఆనందం చూసి అటు నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వివాహానికి అర్చన సుశీలన్, పూర్ణ, అస్వతీ శ్రీకాంత్, ప్రియమణి తదితరులు హాజరయ్యారు.
ఆర్య బ్యాక్ గ్రౌండ్..
ఆర్య విషయానికి వస్తే.. యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టి, నటిగా పేరు సొంతం చేసుకుంది. బిగ్ బాస్ మలయాళం సీజన్ 2లో కూడా సందడి చేసింది. కుంజిరమయనం, మెప్పడియాన్, క్వీన్ ఎలిజబెత్, పవ, ఉల్టా వంటి సూపర్ హిట్ మలయాళం చిత్రాలలో నటించిన ఈమె.. బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. ప్రముఖ నటి అర్చన సోదరుడు, ఐటి ఇంజనీర్ రోహిత్ సుశీలన్ ను పెళ్లి చేసుకున్న ఈమె.. రోయా జన్మించిన తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు.
సిబిన్ బెంజమిన్ ఎవరంటే?
ఈమె పెళ్లి చేసుకున్న సిబిన్ బెంజమిన్ విషయానికి వస్తే డీజే గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన మలయాళ బిగ్ బాస్ ఆరో సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.. ఇతనికి కూడా గతంలో పెళ్లయి, పిల్లలు ఉన్నట్లు సమాచారం.
ALSO READ:Trail OTT: కాజోల్ ట్రయల్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==