Sanju Samson: ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన జట్టులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ కి అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అయితే సంజూ కి జట్టులో అవకాశం లభించిన తర్వాత.. ప్రస్తుతం జట్టులో ఓపెనర్ గా ఆడుతున్న సంజూ కి ఏ స్థానంలో బ్యాటింగ్ లభిస్తుంది..? అనే ప్రశ్న వెంటాడుతుంది. గతంలో అభిషేక్ శర్మతో కలిసి కొన్ని సిరీస్ లలో ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు సంజూ శాంసన్. దీంతో ఇప్పుడు కూడా ఓపెనర్ గానే వస్తాడని అంతా భావిస్తున్నారు.
Also Read: Pragya ojha: అజిత్ అగర్కార్ కు షాక్… సెలక్షన్ కమిటీలోకి రోహిత్ శర్మ స్నేహితుడు
కానీ ఇప్పుడు కేరళ క్రికెట్ లీగ్ లో అతడి బ్యాటింగ్ ఆర్డర్ ని చూస్తే మాత్రం అభిమానులలో కొత్త అనుమానం నెలకొంది. ఎందుకంటే తాజాగా ఈ కేరళ క్రికెట్ లీగ్ టోర్నీలో ఆగస్టు 21న జరిగిన మ్యాచ్ లో సంజూ ఓపెనర్ గా వెళ్లలేదు. కొచ్చి బ్లూ టైగర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇతడు.. రెండు వికెట్లు పడినప్పటికీ క్రీజ్ లోకి రాలేదు. దీంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు గల కారణం ఏంటంటే.. సంజు ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని అతడి భార్య చారులత రమేష్ సోషల్ మీడియాలో ఆసుపత్రి నుండి ఒక అప్డేట్ ని షేర్ చేయడంతో అభిమానులలో కలవరం మొదలైంది.
ఆసియా కప్ 2025 కి ముందు సంజు ఆసుపత్రిలో చేరడంతో.. అతడి ఫిట్నెస్ గురించి ఆందోళనలు మొదలయ్యాయి. ఆగస్టు 21 మధ్యాహ్నం 3 గంటలకు సంజు ఆసుపత్రిలో చేరినట్లు ఓ పోస్ట్ చేశారు చారులత రమేష్. అయితే అదే రోజు జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన సంజు శాంసన్.. బ్యాటింగ్ కి మాత్రం దిగలేదు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆసుపత్రిలో సెలైన్ తో కనిపించిన సంజూ.. మళ్లీ ఐదు గంటల సమయంలోనే బ్యాటింగ్ కి దిగేందుకు సిద్ధంగా కనిపించాడు. ఈ క్రమంలో ప్రత్యర్థి నిర్దేశించిన 98 బరుగులా టార్గెట్ ని సంజు జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే ఛేదించింది.
ఈ క్రమంలో సంజూ కనీసం ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే సంజు ఏ కారణంగా ఆసుపత్రిలో చేరారు అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఈ సమస్య తీవ్రమైంది అయితే.. ఇది భారత జట్టుకు, ముఖ్యంగా సెలెక్టర్లకు ఆందోళన కలిగించే అంశం అవుతుంది. ఆసియా కప్ 2025 కి ముందు సంజూ శాంసన్ తన బ్యాటింగ్ తో సత్తా చాటాడు. గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ లో తన జట్టు కేసీఏ సెక్రటరీ కెప్టెన్ గా ఉండి విజయం సాధించాడు. మరోవైపు ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్ స్థాయిలో గిల్ జట్టులోకి వచ్చాడు. ఇన్ని రోజులు ఓపెనర్ గా ఉన్న సంజూ కి ఇది తలనొప్పిగా మారింది.
Also Read: Samson brothers: తమ్ముడి కెప్టెన్సీలో ఆడుతున్న టీమిండియా ప్లేయర్
అయితే అభిషేక్ శర్మకు మొదటి ఒపెనర్ గా పెద్దపీట వేస్తామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ బహిరంగంగానే వెల్లడించారు. దీంతో కేవలం వికెట్ కీపర్, బ్యాటర్ గా మాత్రమే సంజూ కి ఆసియా కప్ 2025 జట్టులో స్థానం ఇచ్చారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అలాగే కీపర్ కోటాలో జితేష్ శర్మ కూడా ఉన్నందున సంజూ పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ” గిల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్ కూడా. అందువల్ల సంజు ప్లేస్ డేంజర్ లో ఉన్నట్లే. గిల్ ని ఓపెనర్ గా పంపుతారు కాబట్టి సంజూ కి భంగపాటు తప్పదు. ఒకవేళ సంజు కోసం గిల్ ని మూడో స్థానంలో పంపుతారా..? అంటే ఇది కుదరని పని” అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చకు దారికిస్తున్నాయి.