BigTV English

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..

BC Reservations: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలతో సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.. అందులో భాగంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంపై తాజాగా జరగనున్న పీఏసి సమావేశంలో క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయింది.. లోకల్‌బాడీ ఎలక్షన్స్‌లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని ఆధిపత్యం కొనసాగించాలని హస్తం పార్టీ పట్టుదలతో ఉంది. ఇంతకీ 42 శాతం బీసీ రిజర్వేషన్‌ని అధికార పార్టీ ఎలా అమలు చేయబోతుంది?. పీఏసి లో చర్చించి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుంది?


తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన 42 శాతం బీసీ రిజర్వేషన్

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన అంశం 42 శాతం బీసీ రిజర్వేషన్.. ఈ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అనేక సందర్భలో చెప్పుకొచ్చారు. ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ని శాసనసభలో పెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించింది. ఆ అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్ కి చట్టభద్దత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది. పార్లిమెంట్‌లో, బయటా పోరాటం చేసింది.


ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను ఆమోదించని గవర్నర్

ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిక గా కాంగ్రెస్ ధర్నా కూడా చెప్పటింది. ఇంతే కాకుండా ఆర్డినెన్స్ ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని భావించింది. ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కి పంపించింది. కానీ గవర్నర్ సదరు ఆర్డినేన్స్‌ని ఆమోదించలేదు. .ఆ క్రమంలో పార్టీ, ప్రభుత్వం తమ వద్ద ఉన్న చివరి అస్త్రం తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

రిజర్వేషన్‌పై కోర్టు గడప ఎక్కితే స్టే వచ్చే అవకాశం

జీవో ద్వారా కుడా 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళొచ్చు కానీ ఎవరైనా కోర్టు గడప తొక్కితే స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే హస్తం పార్టీ ఇన్ని రోజులు బీసీ ల గురించి చేసింది పక్కకు పోయి చిత్తశుద్ధి లేదనే అంశం హై లైట్ అయ్యే అవకాశం ఉంటుంది. దింతో బద్నామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇక ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్ ఇచ్చింది. కోర్టు తీర్పు కి అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని అధికార హస్తం పార్టీ చెప్తుంది. దీంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశం నిర్వహించడానికి సిద్దమైంది పార్టీ.

Also Read: సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల నేతల సంతాపం..

పీఏసీ మీటింగ్లో రిజర్వేషన్లపై క్లారిటీ వస్తుందా?

పీఏసి కమిటి లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమైన్నట్లు సమాచారం. కోర్టు ఇచ్చిన గడువు లోపు ఎన్నికలు నిర్వహించాలి అంటే ఇక పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి వెళ్ళాల్సిందే వేరే అప్షన్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు నుండి ఇంక సమయం తీసుకుందాం అన్నా… కేంద్రం దాన్ని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చి అమలు చేస్తుందని కానీ…. లేక గవర్నర్ ఆర్డినేన్స్ బిల్లు పాస్ చేస్తారనే నమ్మకం లేదు.. ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బూడిద పాలవుతుంది.ఇక మిగిలిన అప్షన్ ఒక్కటే బీజేపీని దోషి గా చూపిస్తూ… బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి లేదని చెప్తూ.. మేము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రెండు పార్టీ లను ఇరకటం లో పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని పార్టీ, ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరి స్థానిక సంస్థల ఎన్నికలో బీసీ రిజర్వేషన్ పై ఈ పీఏసి లోనైనా క్లారిటీ వస్తుందా..! లేక కోర్టు నుండి మరింత సమయం తీసుకొని … కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి చట్ట పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయించి ఎన్నికలకు వెళ్తుందో చూడాలి.

Story By Rami Reddy, Bigtv

Related News

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Huzurabad Politics: నా సెగ్మెంట్‌లో నీకేం పని.. బండిపై రగిలిపోతున్న ఈటల

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Devaragattu Bunny Utsavam: కొట్టుకు చావడమే సాంప్రదాయమా..! మాల మల్లేశ్వర ఏంటి కథ..

Telangana BJP: అలక, ఆవేదన, అసంతృప్తి.. కొత్త నేతలకు గడ్డుకాలమేనా?

Solar Village: సీఎం ఊరుకు సౌర సొబగులు.. దేశంలోనే రెండో సోలార్ విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

Big Stories

×