E-Paper
Advertisement

Smart Cooker: ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ భలే స్మార్ట్.. ఒకేసారి అన్నం, పప్పు, కూర వండేయొచ్చు

Smart Cooker: ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ భలే స్మార్ట్.. ఒకేసారి అన్నం, పప్పు, కూర వండేయొచ్చు
Advertisement

Smart Cooker: ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్‌లో చాలా మందికి వంట చేయడానికి ఎక్కువ సమయం దొరకడం లేదు. ఉద్యోగాలు, పిల్లల చదువు, ఇంటి పనులు… ఇలా రోజంతా పరుగులు పెడుతుంటారు. ఇలాంటి సమయంలో వంటను త్వరగా పూర్తి చేసే పరికరాలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఇప్పుడు చాలా ఇళ్లలో స్మార్ట్ కుక్కర్లు వాడకం పెరుగుతోంది. ఎందుకంటే ఇవి సాధారణ కుక్కర్లలా కాకుండా రైస్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్, స్టీమర్ చేసే ఇతర పనులు కూడా ఒకే సారి చేస్తాయి. ముఖ్యంగా అన్నం, పప్పు, కూరలను ఒకేసారి తయారు చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి.

స్మార్ట్ కుక్కర్ ఎలా పని చేస్తుంది?

Advertisement

స్మార్ట్ కుక్కర్ వాడటం చాలా ఈజీ. ముందుగా కుక్కర్‌లో ఉండే స్టీల్ లేదా నాన్-స్టిక్ పాత్రలో వండాల్సిన పదార్థాలు వేయాలి. ఉదాహరణకు అన్నం, పప్పు లేదా కూర కోసం కావాల్సిన పదార్థాలు వేయాలి. తర్వాత.. అవసరమైనంత నీరు పోయాలి. అనంతరం మసాలాలు లేదా ఉప్పు వేయాలి. మూత పెట్టి బటన్ నొక్కాలి. కుక్కర్ లోపల వేడి పెరిగి ప్రెజర్ తయారవుతుంది. దాంతో వంట చాలా త్వరగా పూర్తవుతుంది. వంట పూర్తయ్యాక కుక్కర్ స్వయంగా ఆఫ్ అవుతుంది. చాలా మోడళ్లలో “Keep Warm” ఫీచర్ ఉంటుంది. అంటే వంట అయ్యాక కూడా చాలా సమయం ఆహారం వేడిగా ఉంటుంది.

అన్నం, పప్పు, కూర ఒకేసారి వండగలమా?

Advertisement

అవును. చాలా స్మార్ట్ కుక్కర్లలో ఒకేసారి రెండు లేదా మూడు వంటలు చేసుకోగలిగే ఆప్షన్ ఉంటుంది. కుక్కర్ దిగువ భాగంలో పప్పు లేదా కూర పెట్టాలి. పై భాగంలో స్టీమర్ బాస్కెట్‌లో అన్నం పెట్టాలి. ఇలా స్టీమ్ ద్వారా అన్నం వండుతుండగా కింద పప్పు లేదా కూర ప్రెజర్‌లో ఉడుకుతుంది. ఈ విధంగా వంటలు కలవకుండా ఒకేసారి సిద్ధమవుతాయి. సాధారణంగా 20–30 నిమిషాల్లో పూర్తి భోజనం రెడీ అవుతుంది.

బెస్ట్ స్మార్ట్ కుక్కర్లు:

ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని స్మార్ట్ కుక్కర్లు చాలా పాపులర్‌ అయ్యియి.

Geek Robocook Zeta: ఇది 6 లీటర్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ కుక్కర్. ఇందులో రైస్, పప్పు, కర్రీ, బిర్యానీ వంటి వంటల కోసం ప్రత్యేక మెనూలు ఉంటాయి.

Instant Pot: ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందిన స్మార్ట్ కుక్కర్. ఇందులో రైస్, రాజ్మా, చోలే, కర్రీ వంటి వంటలు సులభంగా చేయవచ్చు.

AGARO / Nutricook: ఇవి తక్కువ ధరలో లభించే మంచి స్మార్ట్ కుక్కర్లు. ఇండియన్ వంటలకు బాగా సరిపోతాయి.

Also Read: సిలిండర్ అయిపోయినా నో టెన్షన్.. ఈ గ్యాస్ ప్రత్యామ్నాయాలతో వంట చేసేయండి!

స్మార్ట్ కుక్కర్ల ప్రయోజనాలు:

స్మార్ట్ కుక్కర్లు వాడటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

1. వంట చాలా త్వరగా పూర్తవుతుంది.
2. ఒకేసారి పూర్తి భోజనం తయారవుతుంది.
3. గ్యాస్ వాడకం తగ్గుతుంది.
4. శుభ్రం చేయడం చాలా సులభం.

స్మార్ట్ కుక్కర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

1.కుటుంబానికి సరిపోయే 5–6 లీటర్ల సైజ్ తీసుకోవాలి.

2.మంచి బ్రాండ్ ఎంపిక చేసుకోవాలి.

3.వారంటీ ఉందో లేదో చూడాలి

4.స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్ర ఉన్న మోడల్ అయితే మంచిది

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×