E-Paper
Advertisement

Lassi: పంచదార లేకుండా క్రీమీ లస్సీ ఇలా చేయండి, ఎండల్లో తాగితే రుచి అదిరిపోతుంది

Lassi: పంచదార లేకుండా క్రీమీ లస్సీ ఇలా చేయండి, ఎండల్లో తాగితే రుచి అదిరిపోతుంది
Advertisement

వేసవికాలం మొదలైన వెంటనే చాలా మంది చల్లటి పానీయాలు తాగాలనిపిస్తుంది. శరీరానికి చల్లదనం ఇచ్చే మంచి పానీయం లస్సీ. ఇది పెరుగుతో తయారయ్యే పానీయం. సాధారణంగా లస్సీలో చక్కెర వేసి తాగుతారు. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు చక్కెర వేసుకుని తాగేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు లేదా ఫిట్‌నెస్‌ను చూసుకునేవారు పంచదార తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారికి పంచదార వాడకుండా రుచికరమైన క్రీమీ లస్సీ తయారు చేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

క్రీమీ లస్సీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గట్టి పెరుగు – ఒక కప్పు
బెల్లం పొడి లేదా ఖర్జూరం పేస్ట్ – రెండు స్పూన్లు
సోంపు – అర టీస్పూన్
పుదీనా ఆకులు – గుప్పెడు
అల్లం తురుము – చిటికెడు
చల్లని నీరు – అవసరమైనంత
ఐస్ క్యూబ్స్ – రెండు

Advertisement

Also read: White teeth tips: దంతాలపై పసుపు గీతలు వచ్చాయా? ఈ సులభమైన చిట్కాలతో పళ్లు తెల్లగా మెరిసిపోతాయి

క్రీమీ లస్సీ రెసిపీ
1. మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు గట్టి పెరుగు వేయాలి. పెరుగు తాజాగానే ఉండాలి. తరువాత అందులో బెల్లం పొడి లేదా ఖర్జూరం పేస్ట్ వేయాలి. ఇది సహజమైన తీపి ఇస్తుంది. పంచదారకు బదులుగా ఇవి వాడడం ఉత్తమం.
2. ఇప్పుడు అందులో సోంపు, పుదీనా ఆకులు, అల్లం తురుము వేసుకోవాలి. ఇవి లస్సీకి ప్రత్యేకమైన సువాసన, రుచి ఇస్తాయి. ముఖ్యంగా పుదీనా వేసినప్పుడు లస్సీ మరింత చల్లగా అనిపిస్తుంది.
3. తర్వాత మిక్సీ జార్‌లో కొద్దిగా చల్లని నీరు పోసి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. మిశ్రమం పూర్తిగా స్మూత్‌గా మారే వరకు గ్రైండ్ చేయాలి. అవసరమైతే మరికొంచెం నీరు వేసి మీకు కావాల్సిన లస్సీ తయారుచేసుకోవచ్చు.
4. మిశ్రమం బాగా క్రీమీగా అయిన తరువాత గ్లాస్‌లో పోయాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు.

Advertisement

Aslo read: Curd for Hair: జుట్టు పెరగడం ఆగిపోయిందా? వెంటనే పెరుగుని ఇలా వాడండి

తయారైన లస్సీని చల్లగా గ్లాస్‌లో పోసి పైభాగంలో కొద్దిగా పుదీనా ఆకులు లేదా సోంపు పొడి చల్లి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఈ లస్సీ ఇస్తే చాలా నచ్చుతుంది. ఈ లస్సీ ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. చక్కెర బదులుగా బెల్లం లేదా ఖర్జూరం వాడటం వల్ల ఇది ఆరోగ్యకరమైన పానీయంగా మారుతుంది. పుదీనా, సోంపు కూడా జీర్ణక్రియకు సహాయపడతాయి. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ లస్సీ తాగితే శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని తాగవచ్చు.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×