Vaikuntha Chaturdashi : కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనినే వైకుంఠ చతుర్దశి అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల భక్తులు వైకుంఠ ధామాన్ని పొందుతారని నమ్ముతారు. నవంబరు 6న సాయంత్రం 4.28నిమిషాలకై మొదలై మరుసటి రోజు సాయంత్రం 4.15 నిమిషాలకు ముగుస్తుంది.
సాక్షాత్తూ విష్ణువు ఈ రోజున శివుడ్ని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నవంబర్ 6, కార్తీకశుద్ధ చతుర్ధశిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. శ్రీమహావిష్ణువును తులసి దళాలతోను, శివుడ్ని బిల్వదళాలతో పూజిస్తారు. లక్ష్మీపార్వతులు కూడా నోములు, వత్రాలను ఆచరించే ముత్తయిదవులను అనుగహిస్తారు.
కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి నేరుగా కాశీకి వెళ్లి అక్కడ విశ్వనాథుడ్ని అర్చిస్తాడని అంచారు. ఈ రోజుల లింగ వ్రతాన్ని ఆచరించి జాగరణ చేస్తే వారికి మోక్షం కలుగుతుందని నమ్మకం.
హరి, హరలను ఆరాధిస్తూ ఈ రోజు ఇత్తడి కుందుల్లో గానీ, రాగి కుందుల్లో గానీ దీపాలను వెలిగించి వాటిని దానాలు చేస్తే ఆశించిన శుభాలు ఆనందంగా దరిచేరతాయి. దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు ఐదురోజులు విశేషమైనవి. వీటిని పంచ పర్వాలుగా పిలుస్తారు. నెల రోజులు కార్తీక వ్రతం చేయనివారు కనీసం ఈ ఐదు రోజులైనా వ్రతాన్ని నిర్వహిస్తే చాలు.