Cats Scarified: మేకలు బలి ఇవ్వడం చూశాం.. కొన్ని ప్రాంతాల్లో నరబలి చూశాం. కానీ నిజామాబాద్ జిల్లాలో కొందరు వ్యక్తులు పిల్లులను బలి ఇచ్చారు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. మిర్దాపల్లిలోని ఆలయాల ముందు పిల్లులను బలిఇచ్చారు. గ్రామంలోని మరో నాలుగు దేవతల ఆలయాల ముందు కూడా పిల్లులను చంపేశారు. పిల్లుల బలితో గ్రామంలో అరిష్టం జరగవచ్చని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆలయాల ముందు పిల్లులను బలి ఇచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు..
అయితే మిర్జాపల్లి గ్రామంలో మొత్తం నాలుగు ఆలయాల ముందు గుర్తు తెలియని వ్యక్తులు పిల్లులని బలి ఇచ్చారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు అంతా కూడా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. మన గ్రామానికి ఏదో అరిష్టం జరిగింది అని మూడనమ్మకంతో ప్రజలు అంతా.. భయందోళన చెందుతున్నారు.
Also Read: వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
అరిష్టం జరగవచ్చని గ్రామస్తుల ఆందోళన..
ఇక్కడ అసలు విషయం ఏంటంటే గ్రామంలో ఒక్క ఆలయం కాకుండా నాలుగు ఆలయాల ముందు పిల్లులని బలి ఇచ్చి పడేశి వెళ్లిపోయారు. ఇది కచ్చితంగా క్షుద్రపూజలకు సంబంధించినది అని గ్రామంలో ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అసలు ఇంతకి ఆ పిల్లులని ఎవరు బలి ఇచ్చారు? ఆ గ్రామంలోని వ్యక్తులే ఎవరైన చేశారా ? లేదా వేరే ఎవరైన చేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులకు స కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.