Meenakshi Chaudhary : ఈ మధ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ఏడాది ఒకేసారి నాలుగు ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు అన్ని మంచి టాక్ ను అందుకోవడంతో పాపకు డిమాండ్ పెరిగింది. ఇక సినిమా ఆఫర్స్ వరుసగా క్యూ కడుతున్నాయి.. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నటించిన అమ్మడు ఇప్పటివరకు ఆమె నటించిన ప్రతి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ముఖ్యంగా లక్కీ భాస్కర్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకున్నాయి. ఇకపోతే ఈమధ్య మీ నాకు పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ పట్టేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం
తెలుగులో, తమిళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ వరసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఆమె కెరీర్ బెస్ట్‌గా నిలిచాయి. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో బ్లాక్‌బస్టర్ అందుకున్న మీనాక్షికి ప్రస్తుతం తెలుగులో ‘అనగనగా ఒక రాజు’ అనే మూవీ మాత్రమే చేస్తుంది. పెద్ద హీరోల సినిమాలో ఛాన్స్ అయితే రానట్లు ఉంది ఎందుకంటే ఏ సినిమాని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. బాలీవుడ్ లో ఆఫర్ రావడం గురించి బయట పెట్టింది. హిట్ ఫ్రాంచైజీ అయిన ‘ఫోర్స్’ మూడో భాగం తెరకెక్కించేందుకు అక్కడి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్నాడు.. ఈ మూవీ కోసం ఈమెను సంప్రదించగా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. విపుల్ అమృత్‌లాల్ షా, జాన్ అబ్రహం కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నడుపరాదు మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా మీనా నటనకి మంచి మార్కులు పడ్డాయి.. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఆమె కెరీర్ బెస్ట్‌గా నిలిచాయి.. ఈమధ్య తెలుగులో ఒకటి రెండు సినిమాలకు మాత్రమే సైన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. అలాగే తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 55వ చిత్రంలో కూడా ఈ అమ్మడును సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోవడంతో తెలుగుకి గుడ్ బై చెప్పేసిందా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి మొత్తానికి తెలుగులో సినిమాలు చేయదా? బాలీవుడ్, తెలుగు రెండు మేనేజ్ చేస్తుందా అన్నది చూడాలి..