Intinti Ramayanam Today Episode September 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయా బ్యాగ్ సర్దుకొని అక్కడికి వస్తుంది.. ఏమైందమ్మా ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావని అందరూ అడుగుతారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రేంజ్ లో క్లాస్ పీకుతుంది.. పార్వతిని దారుణంగా అవమానిస్తుంది. నా భర్త రేపు చచ్చిపోయిన సరే మీరు ఇలానే మాట్లాడతారు నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. మీలాగా నేను భర్తను వదిలేసి ఒంటరిగా ఉండలేను. నాకు నా భర్త కావాలి. మీరు ఇంకొకసారి జైలుకు వెళ్లడం అని నాకు హామీ ఇవ్వండి అని శ్రియ అడుగుతుంది.. మాట అనగానే పల్లవి ఒక్కసారిగా అరుస్తుంది.. శ్రియ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని అంటుంది.. అంత పెద్ద వయసున్న అత్తయ్య గారితో నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా అత్తయ్య గారు ఎంత బాధ పడతారు. ఊరుకుంటున్న కదా అని రెచ్చిపోతున్నావే అని పల్లవి చెంప పగలగొడుతుంది. ముందు అత్తయ్యకి క్షమాపణ చెప్పు అని పల్లవి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం లేవగానే అక్షయ్ ఆఫీస్ కి వెళ్లాలని హడావిడిగా రెడీ అవుతాడు. అర్జెంటుగా ఫైలు తీసుకురమ్మని వాళ్ళ బాస్ ఫోన్ చేస్తుంది అయితే ఆటోలనీ క్యాబ్ లని ఎంతగా బుక్ చేసినా సరే రాము అని అంటారు.. ఇక రాజేంద్రప్రసాద్ అక్షయ్ దగ్గరకు వచ్చి నువ్వు అడగడానికి మొహమాటపడుతున్నావేమో అవనీతో వెళ్లొచ్చు కదా అని అంటాడు.. టైం అవుతుందని అక్షయ్ అవని దగ్గరికి వెళ్లి బ్రతిమలాడుతాడు. ఇద్దరూ కలిసి వెళ్తారు. అక్షయ్ అవనికి థాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో అతని ఫైల్ లోని ముఖ్యమైన పేపర్ కింద పడిపోతుంది.
అక్షయ్ హడావిడిగా లోపలికి వెళ్లి ఆ ఫైల్ ని తన మేడం కి ఇస్తాడు.. ఆమె అంతా చెక్ చేసి అందులో ఒక పేపర్ మిస్ అయిందని చెప్తుంది. ముఖ్యమైన పేపర్ నేను మిస్ చేసావు ఇలా నెగ్లెట్ గా ఉండడం ఏంటి అని అడుగుతుంది. నేనేమీ మిస్ చేయలేదు మేడమ్ తీసుకొచ్చాను అని అంటాడు కానీ అక్షయ్ ఇక ఫైలు ఇచ్చి వెతకమని అంటుంది. అక్షయ్ నిజంగా నా పేపర్ ఎక్కడో మిస్ అయింది మేడం అని అంటాడు. భార్యలతో సంతోషంగా ఉండడం మాత్రమే కాదు పని కూడా చేయాలి ఇది లేకపోతే నా దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు నీ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే ఈపాటికి ఉద్యోగం నుంచి పీకి పడిసే దాన్ని అని ఆమె అంటుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన అవని మా ఆయన్ని ఒక్క మాట కూడా అనొద్దు మేడం ఇందులో ఆయన తప్ప ఏమీ లేదు మీరు హడావిడిగా రమ్మన్నారని ఆయన టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాడని అవని అంటుంది. మీరంతా అర్జెంట్ చేశారు కాబట్టే హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అని అంటుంది. మీరు వెతుకుతున్న ఆ పేపర్ ఇదేనా ఒకసారి చూడండి అని అవని అంటుంది. అవును ఇదే ఇదే అని ఆమె అంటుంది. క్షమించండి మేడం మీరు మా ఆయన అంటుంటే నేను ఒప్పుకోలేకపోయాను అందుకే మిమ్మల్ని ఇలా అన్నాను అని అవని అంటుంది.
అక్షయ్ నువ్వు మీ ఆవిడ అవినీతి థాంక్స్ చెప్పు అని అంటుంది. అయితే మా ఆవిడ ఎంత మంచిదో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని అక్షయ్ అంటాడు. అటు పార్వతి శ్రియ అన్నమాట తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. భానుమతి బయట ఎవరి కోసమో వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది చూసిన కమల్ ఏమైందే ముసలి కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతున్న వెంటే అని అంటాడు. మా ఆయన వస్తాడు అనుకున్నాను రా రాలేదు అని భానుమతి అనుకుంటుంది.
ఆ మాట వినగానే కమల్ కోపంతో రగిలిపోతాడు. ఇంట్లో ఇన్ని సమస్యలు ఉంటే నీకు మాత్రం మొగుడు కావలసి వచ్చాడా? నువ్వు మొగుడి కోసం చూస్తున్నావా అసలు నువ్వు ఇంటికి పెద్దదిక్కువేనా అని అడుగుతాడు. నువ్వు అర్జెంటుగా ఏదో ఒకటి చేసి మా అమ్మకి తినిపించాలి అత్తగారిగా అది నీ బాధ్యత అని అంటాడు . పల్లవి పార్వతి దగ్గరికి వెళ్లి శ్రీ యా అన్న మాటలకి బాధపడుతుందేమో ఇప్పుడు ఇంకా ఈమెను మంచిగా చూసుకుంటే నాకు ఏ డోకా ఉండదు అని పల్లవి అనుకుంటుంది. రాత్రి ఈవిడ భోజనం చేయలేదు కదా ఏదో ఒకటి చేసి తీసుకుని వెళ్లి నా బుట్టలో వేసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది.
Also Read: పోలీసుల దగ్గరకు రామరాజు.. భాగ్యం ప్లాన్ అదుర్స్.. శ్రీవల్లికి ప్రేమపై అనుమానం..?
వంట గదిలోకి వచ్చిన పల్లవి కమల్ భానుమతి ఇద్దరు టిఫిన్ చేస్తున్నాడు అని చూసి ఎవరికోసం టిఫిన్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఏది ఏమైనా కూడా నాకు శ్రమ తగ్గించారు అని అనుకుంటుంది. టిఫిన్ చేయగానే ప్లేట్ తీసుకుని వచ్చి దీంట్లో వేయండి అని అడుగుతుంది. ఇది ఎవరి కోసం తీసుకెళ్తున్నావ్ ఎందుకు తీసుకెళ్తున్నావని కమల్ అడుగుతాడు. అత్తయ్య గారి కోసం తీసుకెళ్తున్నాను రాత్రి నుంచి ఏమీ తినలేదు కదా అని అంటుంది పల్లవి. మా అమ్మకి మీవల్లే మనశ్శాంతి లేకుండా పోయింది మీరిద్దరు కోడలుగా వచ్చిన తర్వాత ఇల్లు ఇల్లు లాగా లేదు అని పార్వతి దగ్గరికి వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…