E-Paper
Advertisement

T20 King : T20 కింగ్.. సూర్యకుమార్ యాదవ్!

T20 King : T20 కింగ్.. సూర్యకుమార్ యాదవ్!

T20 King : పొట్టి వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్… T20ల్లో నెంబర్ వన్ గా నిలిచాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు. T20ల్లో పాక్ బ్యాటర్ మహమ్మద్‌ రిజ్వాన్‌ తొలిస్థానంలో ఉన్నప్పుడు… సూర్యకుమార్ యాదవ్ రెండో ప్లేస్ లో ఉన్నాడు. అయితే… నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా జట్లపై హాఫ్ సెంచరీలు బాదడంతో… రిజ్వాన్ ను వెనక్కి నెట్టి… ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు… సూర్యకుమార్ యాదవ్. ఈ ఘనత సాధించిన 23వ బ్యాటర్‌గా నిలిచాడు. T20ల్లో భారత్‌ నుంచి నెంబర్ వన్ గా నిలిచిన సెకండ్ బ్యాటర్ సూర్యకుమార్. సూర్య కంటే ముందు భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లీ మాత్రమే T20ల్లో నెంబర్ వన్ గా ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ 10వ స్థానంలో ఉండగా… రిజ్వాన్‌, న్యూజిలాండ్‌ బ్యాటర్‌ దెవోయ్‌ కాన్వే రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. ఇక మెగా టోర్నీలో సూపర్ సెంచరీలు చేసిన కివీస్ బ్యాటర్ గ్లెన్‌ ఫిలిప్స్‌, దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రోసో టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు.

ఇక T20ల్లో బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి ఒక్క బౌలర్‌ కూడా టాప్-10లో లేడు. భువనేశ్వర్‌ కుమార్‌ ఒక స్థానం దిగజారి 11వ స్థానంలో ఉన్నాడు. ఆప్ఘన్ బౌలర్ రషీద్‌ ఖాన్‌, శ్రీలంక బౌలర్ హసరంగ ఫస్ట్, సెకండ్ ప్లేస్ ల్లో నిలిచారు. ఇక T20ల్లో ఆల్‌రౌండర్ల లిస్ట్ లో హార్దిక్‌ పాండ్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్‌ అల్‌ హసన్‌ తొలిస్థానంలో ఉండగా… ఆప్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్‌ నబీ రెండో స్థానంలో ఉన్నాడు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×