BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ నుంచి తప్పించుకునేందుకు మనోహరి కొత్త ప్లాన్‌  

Nindu Noorella Saavasam Serial Today September 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ నుంచి తప్పించుకునేందుకు మనోహరి కొత్త ప్లాన్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్ ఇంటి నుంచి తప్పించుకుని వచ్చిన మనోహరి చిత్రతో కలిసి గార్డెన్‌ లో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంది. వీళ్లిద్దరినీ అక్కడే కూర్చుని గమనిస్తున్న ఆరు తిట్టుకుంటుంది. ఏదో పెద్ద దేశ సమస్యల గురించి ఆలోచిస్తున్నట్టు మీరు మీ వెధవ ముఖాలు ఎదుటి వాళ్ల నమ్మకాలు కూల్చడం.. నమ్మిన వాళ్ల కొంపలు ముంచడం తప్పా ఏం చేస్తారు మీరు ఊరికే అటూ ఇటూ తిరగడం కాదు ఏదో ఒకటి మాట్లాడి చావండి అంటుంది. వెంటనే ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి ఏదైనా తట్టిందా..? అని చిత్రను మనోహరి అడుగుతుంది. దాని బుద్దికి అసలు ఏం తడుతుంది అని ఆరు అనుకుంటుంది. నిన్న రాత్రి అమరేంద్ర బావ భాగీ డిస్కస్‌ చేసుకున్నారు. పొద్దున్నే రాథోడ్, రణవీర్‌కు కాల్ చేశాడు. భాగీ, రాథోడ్‌ అనాథ ఆశ్రమానికి వెళ్లారు. రణవీర్‌, అమర్‌ బావ ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ అమర్‌ బావ మీ పాప దొరికింది. రేపటి కల్లా  వస్తుంది అని చెప్పిండు.. ఇదే కదా జరిగింది అంటూ చిత్ర చెప్పగానే..


నేను చెప్పిందే నాకు చెప్తున్నావేంటి నువ్వు అంటుంది మను. నేను చెప్తుంది అదే కదా దాని బుర్రలో గుజ్జు లేదు.. అంటుంది ఆరు. నీతో ఫోన్‌లో రణవీర్‌ ఏం చెప్పాడు అన్నావు.. రేపు పాప రాగానే.. కోల్‌కతా తీసుకెళ్లిపోతాను ఆలోపు నువ్వు వెళ్లి పాపను చూడు అనే కదా అంటుంది చిత్ర. అవును రణవీర్‌ నాతో అలాగే చెప్పాడు అని మను చెప్పగానే.. ఇదంతా ట్రాప్‌ మనోహరి అని చిత్ర అంటుంది. వెంటనే మను షాక్ అవుతుంది. అవును నిన్ను పట్టుకోవడానికి అమరేంద్ర బావ వేసిన వల అది.. ఎవరో పాపను తీసుకొచ్చి అది నీ పాప అని చెప్తే నువ్వు చూడటానికి వెళ్తావు కదా అప్పుడు నిన్ను పట్టుకోవచ్చని ఇలా ప్లాన్ చేశారు అని చిత్ర చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. ఆరు ఆశ్చర్యంగా అమ్మో చిత్ర నువ్వు తింగరిదానివి అనుకున్నాను.. ఈ ఇంటి ఫుడ్‌ తిని నీకు కూడా తెలివి ఒంటబట్టింది.. బాగానే గెస్‌ చేశావు అనుకుంటుంది ఆరు.

నిజంగా వాళ్ల ప్లాన్‌ ఇదే.. రణవీర్‌ వైఫ్‌గా నిన్ను పట్టుకోవడానికి వాళ్లు ఈ ప్లాన్‌ చేశారు.. అంటుంది చిత్ర. దీంతో మనోహరి కోపంగా నన్ను పట్టుకోవడానికి అమర్‌ ఇంత పెద్ద ప్లాన్‌ వేస్తారని నేను అనుకోలేదు.. అంటుంది. ఆహా నీ కడుపు చల్లగుండా.. నువ్వు ఇలాగే అనుకుంటూ ఉండు అని ఆరు అంటుంది. దీంతో చిత్ర అమరేంద్ర బావ మిలటరీ వాడు మను శత్రువును పట్టుకోవడానికి ఇలాంటి ఎత్తులు.. పై ఎత్తులు ఎన్నో వేస్తుంటాడు అని చిత్ర చెప్పగానే.. అమరేంద్ర వ్యూహాలన్నీ యుద్దంలోనే మామూలు మనుషుల మీద వాటిని ప్రయోగించడు. అయితే గియితే ఇది భాగీ ప్లానే అయి ఉంటుంది.. అనగానే.. ఆరు కోపంగా ఇద్దరూ కరెక్ట్‌ గానే ఆలోచిస్తున్నారు మీ ముఖాలు మండ అని తిట్టుకుంటుంది. ప్లాన్‌ ఎవరిదైతే ఏంటి మను ఇరుక్కునేది మాత్రం నువ్వే కదా అంటుంది చిత్ర.


భాగీ ఇలాంటి ప్లాన్‌ చెప్పినా.. అమరేంద్ర ఒప్పుకోడే.. అంటుంది మను. ఎందుకు ఒప్పుకోడు అని చిత్ర అడుగుతుంది. ఎందుకంటే అమరేంద్ర ఇంతకంటే హైలెవెల్‌లో ఆలోచిస్తాడు కాబట్టి అంటుంది మను. అవును నువ్వు ఓ పెద్ద ఇంటర్‌ నేషనల్‌  క్రిమినల్‌వి మరి నీ కోం పెద్ద స్థాయిలో ఆలోచించడానికి అంటుంది చిత్ర దీంతో మను కోపంగా చిత్రా అంటూ గట్టిగా అవరగానే.. ఎందుకు నీ మీద అరుస్తున్నావు.. నువ్వు దొరికిపోవడానికి ఈ ప్లాన్‌ చాలదా..? అసలు ఎందుకు అంత నెగ్లెక్ట్‌ చేస్తున్నావు అని చిత్ర అడుగుతుంది. ఏం చేయాలో అదే చేస్తాను.. నువ్వు చూస్తూ ఉండు చిత్ర అంటూ మను వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..

Tv Anchors : హీరోయిన్లను మించి యాంకర్స్ సంపాదన.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?

MeghaSandesham : ‘మేఘ సందేశం ‘ భూమి అసలు పేరేంటి..? ఒక్కరోజుకు ఎంతంటే..?

Bill Gates Acting : యాక్టింగ్ ఫీల్డ్‌లోకి బిల్ గేట్స్…సీరియల్‌లో నటించబోతున్న ప్రపంచ సంపన్నుడు.!

Jabardast : ప్రదీప్ రంగనాథన్ ను వదలని శాంతి స్వరూప్..శరత్ కుమార్ కు చెమటలు..

Illu Illalu Pillalu Today Episode: క్యాబ్ డ్రైవర్ గా ధీరజ్.. ప్రేమ నమ్మకమే నిజం అవుతుందా..? శ్రీవల్లికి టెన్షన్.. టెన్షన్..

Brahmamudi Serial Today October 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు నిజం చెప్పిన రాజ్‌  

Intinti Ramayanam Today Episode: కోడళ్ల మాటతో పార్వతి షాక్.. పల్లవి పై కమల్ సీరియస్..అవనికి పల్లవి ఝలక్..

Big Stories

×