Ashish Vidyarthi:సినిమా అనే రంగుల ప్రపంచంలో విహరించడానికి ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అయితే అలా వచ్చినవారికి ఇండస్ట్రీ ఎంతవరకు మేలు చేసింది? అనేదే ప్రశ్న. కొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటారు. మరికొంతమంది సంవత్సరాలు తరబడి సినిమాలలో నటిస్తున్నా.. గుర్తింపు మాత్రం లభించదు. కానీ పొట్టకూటి కోసం తప్పని పరిస్థితిలో ఏదో ఒక పనిచేసి కడుపు నింపుకుంటున్నామని ఇప్పటికే ఎంతోమంది మీడియా ముఖంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి జాబితాలోకి ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి(Ashish Vidyarthi)కూడా వచ్చి చేరిపోయారు.. ముఖ్యంగా పొట్టకూటికోసం అలా చేయక తప్పలేదు అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..”ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ముఖ్యంగా ఆ సమయంలో అవకాశాలు లేక జీవనం సాగించడం చాలా కష్టంగా మారింది. అందుకే అప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) తో కలిసి బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించాను. పొట్టకూటి కోసం ఆ సినిమాలు చేయక తప్పలేదు. కానీ వాటిలో నటించడం నాకు తీవ్రమైన బాధను కలిగించింది. కానీ ఏం చేద్దాం.. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచలేదు. వేరే సినిమాలలో అవకాశాలు రాలేదు. దాంతో తప్పని పరిస్థితుల్లో కడుపు నింపుకోవడానికి అలా చేసి ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాను” అంటూ ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆశిష్ విద్యార్థి కెరియర్..
ఆశిష్ విద్యార్థి విషయానికొస్తే.. 1967 ఫిబ్రవరి 12న కేరళలోని తెళ్లిచెర్రీలో జన్మించారు. ఈయన తల్లి పేరు రేబా విద్యార్థి. ఆమె కథక్ నృత్యకారిణి. ఈయన ఢిల్లీలో పెరిగి పెద్దయ్యారు. హిందీ సినిమాలలో విలన్ గా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. 1986 లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఏ కె 47 అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఎక్కువగా తెలుగు చిత్రాలలో నటించిన ఆశీష్ విద్యార్థి విలన్ పాత్రలకు పెట్టింది పేరు. ఒకవైపు తెలుగులో నటిస్తూనే.. తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
జల ప్రమాదం నుండి బయటపడ్డ ఆశిష్ విద్యార్థి..
ఇకపోతే సుమారుగా పదుల సంఖ్యలో సినిమాలు చేసే ప్రేక్షకులను అలరించిన ఈయన.. 2014 అక్టోబర్ 20న సినిమా షూటింగ్లో భాగంగా జల ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఓనం సెలబ్రేషన్స్ లో సందడి చేసిన ఆశిష్ విద్యార్థి..
ఇకపోతే నిన్న కేరళ సాంప్రదాయ ఉత్సవమైన ఓనం సెలబ్రేషన్స్ లో చాలామంది పాల్గొన్నారు. అందులో భాగంగానే సొంత గూటికి చేరుకున్న ఆశీష్ విద్యార్థి కూడా ప్రజలందరికీ ఓనం శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఆశిష్ విద్యార్థికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.